SSC GD Constable Recruitment 2025-26 : నిరుద్యోగులకు శుభవార్త ! కేవలం పదో తరగతి విద్యార్హతతో 25,487 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అర్హత గల పురుషులు మరియు మహిళా అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే పరీక్ష పరీక్షలను 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు. కాబట్టి అభ్యర్థులు పరీక్షలు తెలుగులో కూడా రాసుకోవచ్చు.. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలని ఈ ఆర్టికల్ మీరు చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత మరియు ఆసక్తి ఉంటే ఈ ఉద్యోగాలకు డిసెంబర్ 31వ తేదీ లోపు ఆన్లైన్లో అప్లై చేయండి.
✅ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ – Click here
Table of Contents :
నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నుండి విడుదలైంది.
నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), SSF మరియు అస్సాం రైఫిల్స్ నందు కానిస్టేబుల్ (GD) ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF), SSF మరియు అస్సాం రైఫిల్స్ నందు 25,487 కానిస్టేబుల్ (GD) పోస్టులు భర్తీ చేస్తున్నారు.
అర్హత :
ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 01-01-2026 తేదీ నాటికి పదో తరగతి పాస్ అయిన పురుష మరియు మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
జీతం వివరాలు :
ఎంపికైన వారికి 21,700/- నుండి 69,100/- వరకు ఉండే పే స్కేల్ ప్రకారం జీతం చెల్లిస్తారు.
వయస్సు వివరాలు :
ప్రస్తుతం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు 01-01-2026 తేదీ నాటికి 18 సంవత్సరాల నుండి 23 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు అప్లై చేయడానికి అర్హులు.
వయస్సులో సడలింపు వివరాలు :
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయసులో ఐదు సంవత్సరాలు సడలింపు ఉంటుంది. ఓబిసి అభ్యర్థులకు వయసులో మూడేళ్లు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ తేదీలు :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను అధికారిక వెబ్సైట్లో డిసెంబర్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ లోపు ఆన్లైన్ విధానంలో సబ్మిట్ చేయాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
పరీక్ష తేదీలు :
ఉద్యోగాలు ఎంపిక ప్రక్రియలో భాగంగా పరీక్షలను 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ నెలలో నిర్వహించబోతున్నట్లుగా నోటిఫికేషన్ లో ప్రకటించారు.
- మహిళలు, ఎస్సీ, ఎస్టి మరియు ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు లేదు.
- మిగతావారు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
ఎంపిక విధానం వివరాలు :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులను రాత పరీక్ష, PET, PST , వైద్య పరీక్షలు మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
✅ Download Notification – Click here
