Highcourt Data Entry Operator Jobs Recruitment 2025 : హైకోర్టు ఆఫ్ కేరళ నుండి కాంట్రాక్ట్ పద్ధతిలో టెక్నికల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం అర్హత ఉన్న భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు డిప్లమో లేదా డిగ్రీ విద్యార్హతలు ఉన్నవారు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు.
నోటిఫికేషన్ యొక్క వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఆర్టికల్ చివర్లో ఇచ్చిన లింక్స్ ఉపయోగించి ఆన్లైన్ విధానంలో అప్లై చేయండి.
▶️ పంచాయతీరాజ్ శాఖలో డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలు – Click here
Table of Contents :
రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
ఈ నోటిఫికేషన్ కేరళలో ఉన్న హైకోర్టు నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
నోటిఫికేషన్ ద్వారా మొత్తం 28 పోస్టులు భర్తీ చేస్తున్నారు.
విద్యార్హతలు వివరాలు :
టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎలక్ట్రానిక్స్ లేదా ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ మూడు సంవత్సరాల డిప్లమో కోర్స్ పూర్తి చేసి ఉండాలి మరియు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లేదా కోర్టులు లేదా PSU ల్లో ఐటీ టెక్నికల్ సపోర్ట్ నందు ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ హార్డ్వేర్ లేదా ఎలక్ట్రానిక్స్ లో మూడేళ్ల డిప్లమో కోర్సు పూర్తి చేసి ఉండి లేదా ఏదైనా డిగ్రీ విద్యార్హత తోపాటు కంప్యూటర్ వర్డ్ ప్రాసెసింగ్ లేదా డేటా ఎంట్రీ ఆపరేషన్ నందు సర్టిఫికేషన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి మరియు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు లేదా కోర్టులు లేదా PSU ల్లో వర్డ్ ప్రాసెసింగ్ లేదా డేటా ఎంట్రీ ఆపరేషన్ లేదా ఈ సేవ కేంద్రాలు లేదా ICT Equipment నందు ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి.
వయస్సు వివరాలు :
02/01/1989 నుండి 01/01/2007 మధ్య పుట్టిన తేదీ కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
జీతము వివరాలు :
టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 30,000/- జీతము ఇస్తారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 22,240/- జీతం ఇస్తారు.
అప్లికేషన్ విధానము :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు కేరళ హైకోర్టు అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసే సమయంలో 600 రూపాయలు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్ తేదీలు :
అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో నవంబర్ 17వ తేదీ నుండి డిసెంబర్ 16వ తేదీ లోపు అప్లై చేయాలి.
ఎంపిక విధానం వివరాలు :
అప్లై చేసిన అభ్యర్థులను స్కిల్ టెస్ట్ లేదా / మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు అధిక సంఖ్యలో అభ్యర్థులు అప్లై చేస్తే అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసేందుకు పరీక్ష నిర్వహించి తరువాత స్కిల్ టెస్ట్ లేదా / మరియు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
✅ Download Notification – Click here
✅ Official Website – Click here
