Delhi Technological University Junior Assistant Jobs : డిగ్రీ విద్యార్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ లోపు సబ్మిట్ చేయాలి.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న భారతీ పౌరులు అందరూ అప్లై చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి..
Table of Contents :
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ న్యూఢిల్లీలో ఉన్న ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుండి విడుదలైంది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్ మరియు ఆఫీసు అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే పోస్ట్లు భర్తీ చేస్తున్నారు.
మొత్తం ఖాళీల సంఖ్య :
50 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు మరియు 16 డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా ఆఫీసు అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు.
✅ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు – Click here
అర్హతలు :
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేయగలగాలి.
ఆఫీసు అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీ పాసై ఉండి ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో నిమిషానికి 30 పదాలు టైపింగ్ చేయగలగాలి మరియు కనీసం రెండు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు వివరాలు :
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 32 సంవత్సరాలలోపు ఉండాలి. ఆఫీసు అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలి.
వయసులో సడలింపు వివరాలు :
- ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
- ఓబిసి (ఢిల్లీ) అభ్యర్థులకు వయసులో మూడేళ్లు సడలింపు ఉంటుంది.
- PwBD అభ్యర్థులకు వయస్సులో పదేళ్లు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ తేదీలు :
ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్లో నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీలోపు సబ్మిట్ చేయాలి.
ఎంపిక విధానం :
ఈ ఉద్యోగాలు ఎంపికలో రాత పరీక్ష లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
స్కిల్ టెస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది తుది ఎంపికలో రాత పరీక్ష లేదా కంప్యూటర్ ఆధారత పరీక్షలు వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
GEN / OBC అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు 1500/-
మిగతా వారికి అప్లికేషన్ ఫీజు 750/-
గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు క్రింద ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి..
✅ Download Notification – Click here
✅ Official Website – Click here
