WhatsApp లో తల్లికి వందనం పథకం స్టేటస్ చెక్ చేసుకోండి ఇలా | How to Check Thalliki Vandhanam Scheme Status in WhatsApp

WhatsApp లో తల్లికి వందనం పథకం స్టేటస్
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలుకు రంగం సిద్ధం అయ్యింది. ఇప్పటికే G.O విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హత కలిగి ఉన్నామా ? లేదా ? ఈ పథకం యొక్క స్టేటస్ ఎలా తెలుసుకోవాలి? అలానే SC కేటగిరీ కి చెందిన విద్యార్థులకు సంబంధించి అమౌంట్ ఎవరికి క్రెడిట్ అవుతుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేసింది వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 WhatsApp లో తల్లికి వందనం పథకం స్టేటస్ చెక్ చేసే విధానం :

  • తల్లికి వందనం పథకం కి సంబంధించి లబ్ధిదారులు స్టేటస్ చెక్ చేసుకొనేందుకు గాను అవకాశం ఇచ్చారు.
  • ఇందుకు గాను మన మిత్ర వాట్సాప్ సర్వీసులో భాగంగా అవకాశం కల్పించారు.
  • ముందుగా మన మిత్ర వాట్సాప్ సర్వీస్ నంబర్ 9552300009 ను సేవ్ చేసుకొని , Hai అని మెసేజ్ చేయాలి. ఆ తర్వాత సిటిజన్ సర్వీసెస్ నుండి Thalliki Vandhanam status అనే టాబ్ పై క్లిక్ చేయవలసి వుంటుంది.
  • ఆ తర్వాత తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , సబ్మిట్ చేయగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.

🔥తల్లికి వందనం కొరకు ఇంటర్మీడియట్ SC విద్యార్థులు NPCI లింక్ చేసుకోగలరు :

  • తల్లికి వందనం పథకం కి సంబంధించి , SC విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ తెలియచేసింది. వీరికి కేంద్ర ప్రభుత్వ వాటాను విద్యార్థి యొక్క అకౌంట్ కి జమ చేయనున్నారు.
  • వీరికి సంబంధించి బ్యాంకు అకౌంట్ లేకపోతే వారు తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. ఇప్పటికే అకౌంట్ కలిగి వున్న వారు NPCI లింక్ చేసుకోవాలి.
  • ఈ అంశానికి సంబంధించి , విద్యార్థుల జాబితా ఇప్పటికే గ్రామ, వార్డ్ సచివాలయం లలో అందుబాటులో ఉన్నాయి కావున లబ్ధిదారులు సచివాలయం లను సంప్రదించి, సమాచారం తెలుసుకోగలరు.

🏹 తల్లికి వందనం పథకం డబ్బులు రావాలి అంటే ఇలా చేయండి – Click here

🔥తల్లికి వందనం పథకం గ్రీవెన్స్ రైస్ చేయు విధానం:

  • తల్లికి వందనం పథకం కి సంబంధించి , గ్రీవెన్స్ రైస్ చేసుకొనేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
  • అర్హత కలిగి ఉండి , అనర్హుల జాబితాలో లబ్ధిదారులు ఉంటే వారు గ్రామ వార్డు సచివాలయం లో గల డిజిటల్ అసిస్టెంట్ / వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీ వారు లాగిన్ లో గ్రీవెన్స్ రైస్ చేసేందుకు అవకాశం కల్పించారు.
  • ఈ నెల 20వ తేదీ లోగా గ్రీవెన్స్ రైస్ చేసేందుకు అవకాశం కల్పించారు.
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *