తెలంగాణ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల పరీక్ష రాసిన అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్… తెలంగాణ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల నోటిఫికేషన్ 11-09-2024 తేదీని విడుదల చేశారు.
ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో భాగంగా 2024 సంవత్సరంలో నవంబర్ 10వ తేదీన కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించారు. నవంబర్ 12వ తేదీన ప్రొవిజినల్ “కీ” విడుదల చేసి అభ్యర్థుల నుండి అభ్యంతరాలను స్వీకరించారు.
ప్రొవిజినల్ “కీ” పై అభ్యంతరాలను పరిశీలించి 2025 మార్చి 10వ తేదీన ఫైనల్ “కీ” విడుదల చేశారు.
ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు మొత్తం 24,045 మంది అప్లై చేసుకున్నారు. వీరిలో 23,323 అభ్యర్థులు పరీక్ష రాశారు.
ప్రస్తుతం తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు అభ్యర్థుల యొక్క కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పని చేయడం వలన వారికి వచ్చిన వెయిటేజీ పాయింట్స్ మరియు అభ్యర్థులు ఇతర వివరాలు తెలియజేస్తూ ప్రొవిజనల్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది.

ఈ ప్రొవిజినల్ లిస్టులో ఇచ్చిన వివరాలలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన మార్కులు మరియు వెయిటేజ్ పాయింట్స్ వచ్చిన మాత్రమే మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు వెరిఫై చేయడం జరిగింది. మిగతా వివరాలను షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి వెరిఫై చేస్తారు.
ప్రస్తుతం మెడికల్ మరియు హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసిన ప్రొవిజినల్ లిస్ట్ పైన అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే జూన్ 10వ తేదీ నుండి జూన్ 15వ తేదీ మధ్య మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అధికారిక వెబ్సైట్ లో అభ్యర్థుల వివరాలను ఉపయోగించి లాగిన్ అయ్యి అబ్జెక్షన్ నమోదు చేసే అవకాశం ఇచ్చారు.
🏹 Download Lab Technician Provisional List – Click here
🏹 Official Website – Click here