తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో వైద్య ,ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (PM JANMAN) లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినందుకు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి విడుదల చేయబడింది.
PM JANMAN లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్, మెడికల్ ఆఫీసర్, పారామెడిక్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు మే 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జరిగే ఇంటర్వ్యూలకు స్వయంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు జిరాక్స్ కాపీలు, ఒక ఫోటోతో హాజరు కావాల్సి ఉంటుంది.

PM JANMAN ఉద్యోగాల అర్హతలు :
మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంబిబిఎస్ పూర్తి చేసి ఉండాలి.
ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు DMLT లేదా బీఎస్సీ MLT కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులు.
పారామెడికల్ కం అసిస్టెంట్ ఉద్యోగాలకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (MPHW) అర్హత ఉన్నవారు అర్హులు.
PM JANMAN ఉద్యోగాలకు జీతము వివరాలు :
- మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 52,000/- జీతము ఇస్తారు.
- ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ నెలకు 27,500/- జీతం ఇస్తారు.
- పారామెడిక్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు 15,000/- జీతం ఇస్తారు.
🏹 Download Notification – Click here