ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ ఎక్సపోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఇండియా EXIM బ్యాంక్) నందు వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
ఎక్సపోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఇండియా EXIM బ్యాంక్) సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
మొత్తం 28 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
మేనేజ్మెంట్ ట్రైనీ, డిప్యూటీ మేనేజర్, చీఫ్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
మేనేజ్మెంట్ ట్రైనీ (డిజిటల్ టెక్నాలజీ) – 10
మేనేజ్మెంట్ ట్రైనీ (రీసెర్చ్ అండ్ అనాలసిస్) – 05
మేనేజ్మెంట్ ట్రైనీ(రాజ్ భాషా) – 02
మేనేజ్మెంట్ ట్రైనీ (లీగల్) – 05
డిప్యూటీ మేనేజర్ (లీగల్) – 04
డిప్యూటీ మేనేజర్ (డిప్యూటీ కంపైలన్స్ ఆఫీసర్) – 01
చీఫ్ మేనేజర్(కంపైలన్స్ ఆఫీసర్) – 01
🔥 విద్యార్హత :
మేనేజ్మెంట్ ట్రైనీ: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత విభాగంలో BE లేదా B.Tech కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి. మరియు MCA కుడా పూర్తి చేసి ఉండాలి.
డిప్యూటీ మేనేజర్: సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత మరియు పని అనుభవం కలిగి వుండాలి.
చీఫ్ మేనేజర్: సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత తో పాటు 10 సంవత్సరాల పని అనుభవం కలిగి వుండాలి.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 గరిష్ఠ వయస్సు :
మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు వయస్సు 28 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు వయస్సు 30 సంవత్సరాలలోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
చీఫ్ మేనేజర్ ఉద్యోగాలకు 40 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఓబీసీ వారికి 3 సంవత్సరాలు , ఎస్సీ, ఎస్టీ వారికి 5 సంవత్సరాలు , PWBD వారికి 10 సంవత్సరాలు వయోపరిమితి కలదు.
🔥దరఖాస్తు విధానం :
అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
ఎస్సీ , ఎస్టీ , PwBD,EWS, మహిళా అభ్యర్థులు 100/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
జనరల్/ఓబీసీ అభ్యర్థులు 600/- రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
🔥 జీతం :
మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 65,000/- రూపాయల వరకు స్టైఫండ్ లభిస్తుంది.
డిప్యూటీ మేనేజర్ గా ఎంపిక కాబడిన వారికి 48,480/- నుండి 85,920/- రూపాయల వరకు జీతం లభిస్తుంది.
చీఫ్ మేనేజర్ గా ఎంపిక అయిన వారికి 85,920/- నుండి 1,05,280/- రూపాయల వరకు జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అభ్యర్థులను వ్రాత పరీక్ష , పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 22/03/2025
ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 15/04/2025
వ్రాత పరీక్ష నిర్వహణ : మే 2025.