ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో 10,762 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని హోం మంత్రి అనిత గారు అసెంబ్లీలో తెలిపారు.
✅ వివిధ రకాల ఉద్యోగాల సమాచారం ప్రతీ రోజూ మీ మొబైల్ కి రావాలి అంటే మా What’s App మరియు Telegram ఛానెల్స్ లో జాయిన్ అవ్వండి.
తాజా అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా హోం మంత్రి అనిత గారు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం 16,862 పోస్టులు ఖాళీగా ఉన్నాయి అని చెప్పారు. గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్ కు సంబంధించిన 6,100 ఉద్యోగాల నియామక ప్రక్రియ త్వరలో పూర్తి అవుతుందని తెలిపారు. మిగిలిన 10,762 పోస్టుల భర్తీకి అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించమని తెలిపారు. ప్రభుత్వ అనుమతి రాగానే రిక్రూట్మెంట్ ప్రక్రియ చేపడతామని హోం మంత్రి గారు అసెంబ్లీలో ప్రకటించారు.
🏹 AP లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ లో ఉద్యోగాలు – Click here
కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఇంటర్ పూర్తి చేసిన నిరుద్యోగులు ఇప్పటి నుండే ప్రిపరేషన్ ప్రారంభిస్తే ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. All the best 👍