ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి R&R కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు పోస్టులను అనుసరించి పదో తరగతి, డిప్లమో, డిగ్రీ, బిటెక్ వంటి విద్యార్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అర్హత ఉన్నవారు తమ దరఖాస్తులను 07-04-2025 తేదీలోపు అందజేయాలి.
🏹 AP ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలు – Click here
🏹 ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇 👇
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఎక్స్ అఫీషియో జాయింట్ కలెక్టర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ , రాజమహేంద్రవరం నుండి ఈ నోటిఫికేషన్ విడుదలైంది.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 06 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇందులో పోస్టులు వారీగా ఖాళీలు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
- సీనియర్ అసిస్టెంట్ – 01
- వర్క్ ఇన్స్పెక్టర్ – 02
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – 02
- ఆఫీస్ సబార్డినేట్ – 01
🔥 ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతల వివరాలు :
- సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
- వర్క్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమో లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు.
- డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు బీసీఏ లేదా ఎంసీఏ లేదా కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్స్ లో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
- ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి పదో తరగతి అర్హత ఉన్నవారు అర్హులు.
🔥 జీతము వివరాలు :
- ఈ ఎంపికైన వారికి ఇచ్చే జీతం వివరాలు నోటిఫికేషన్ లో తెలుపలేదు. ప్రభుత్వ నిబంధనలో ప్రకారం జీతం ఇస్తారు.
🏹 పదో తరగతి అర్హతతో కోస్ట్ గార్డులో ఉద్యోగాలు – Click here
🔥 ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు లేదు.
🔥 వయస్సు వివరాలు :
- 18-09-2024 నాటికి 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులు.
🔥 అప్లికేషన్ విధానం :
- అర్హత ఉండే అభ్యర్థులు తమ దరఖాస్తులను గెజిటెడ్ అధికారులచే అటేస్టేషన్ చేయించిన విద్యార్హత సర్టిఫికెట్స్, స్టడీ సర్టిఫికెట్స్, కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువపత్రం, ఆధార్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు ఇతర సర్టిఫికెట్స్ తో ఏప్రిల్ 7వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు స్వయంగా వెళ్లి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా :
- ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ మరియు ఎక్స్ అఫీషియో జాయింట్ కలెక్టర్, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ , C.R.P గెస్ట్ హౌస్, ధవలేశ్వరం గ్రామం, రాజమహేంద్రవరం రూరల్ నందు అర్హులైన వారు తమ దరఖాస్తులను అందజేయాలి.
🔥 అప్లికేషన్ చివరి తేదీ :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న వారు తమ దరఖాస్తులను 07-04-2025 తేదిలోపు అప్లై చేయాలి.
🔥 ఎంపిక విధానం :
- సీనియర్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్ మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
- ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాన్ని మెరిట్ మరియు పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
✅ అభ్యర్థులకు ముఖ్య గమనిక :
- ఈ ఉద్యోగాలకు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేయడానికి అర్హులు.
- అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ లో ఇచ్చిన రిజర్వేషన్లు మరియు రోస్టర్ పాయింట్లతో పాటు మిగతా వివరాలన్నీ తెలుసుకొని అప్లికేషన్ పెట్టుకోండి.
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తర్వాత అప్లై చేయండి. క్రింద ఇచ్చిన లింకుపైన క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
🔥 Download Notification – Click here