మినిరత్న కేటగిరి – 1 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజ్ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), నార్త్ ఈస్టర్న్ రీజియన్ సంస్థ నుండి ఒక సంవత్సర కాలంపాటు పని చేసే విధంగా వివిధ విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, ట్రెడ్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
అన్ని విభాగాలలో మొత్తం 90 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.
📢 Cognizant లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( AAI), నార్త్ ఈస్టర్న్ రీజియన్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- మొత్తం 90 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 30
- టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటిస్ -30
- ట్రేడ్ అప్రెంటిస్ ( ఐటిఐ) -30
🔥 విద్యార్హత :
- ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ : అభ్యర్థులు సంబంధిత విభాగంలో 4 సంవత్సరాల డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటిస్ : అభ్యర్థులు సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- ట్రేడ్ అప్రెంటిస్ ( ఐటిఐ) : అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించి వుండాలి లేదా NCVT సర్టిఫికేట్ కలిగి వుండాలి.
🔥 వయస్సు :
- 18 సంవత్సరాల నుండి 27 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు & దివ్యాంగులు అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
🔥 దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ఎంపికా విధానం:
- అభ్యర్థులను సంబంధిత విద్యార్హత విభాగంలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 జీతం :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకి 15,000/- రూపాయలు లభిస్తుంది.
- టెక్నికల్ (డిప్లొమా) అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకి 12,000/- రూపాయలు లభిస్తుంది.
- ట్రేడ్ అప్రెంటిస్ (ఐటిఐ) ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 9000/- రూపాయలు లభిస్తుంది.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 13/03/2025
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 20/03/2025