అన్ని జిల్లాల వారు అర్హులే | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్ లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | APSFC Jobs Recruitment 2025

విజయవాడ  కేంద్రంగా గల ఆంద్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (APSFC) సంస్థ నుండి ఆంధ్రప్రదేశ్ కి చెందిన  ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నుండి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

అన్ని విభాగాలలో కలిపి మొత్తం 30 ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాధిపతికన , 36 నెలలకు పని చేసేందుకు గాను భర్తీ చేస్తున్నారు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, పరీక్షా విధానం, పరీక్షా కేంద్రాలు మొదలగు పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ

  • ఆంద్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ ( APSFC) సంస్థ 36 నెలలకు గాను పని చేసేందుకు గాను కాంట్రాక్టు ప్రాధిపతికన ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య

  • 30 అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ జరగనుంది.
    1. అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) – 15
    2. అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) – 8
    3. అసిస్టెంట్ మేనేజర్ (లీగల్) – 7

🔥 విద్యార్హత :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఇంగ్లీష్ మరియు తెలుగు భాషలలో మాట్లాడడం , రాయడం చదవడం వచ్చి వుండాలి.
  1. అసిస్టెంట్ మేనేజర్ ( ఫైనాన్స్) :
    1. ఏదైనా యూనివర్సిటీ నుండి 60 శాతం మార్కులతో CA (ఇంటర్) / CMA ( ఇంటర్) MBA (ఫైనాన్స్) / PGDM (ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించాలి. 
    2. బ్యాంకులు / ఫైనాన్స్ సంస్థలలో సంబంధిత విభాగంలో ఒక సంవత్సర అనుభవం కలిగి వుండాలి.
  1. అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) :
    1. ఏదైనా యూనివర్సిటీ నుండి 60 శాతం మార్కులతో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో బి. టెక్ ఉత్తీర్ణత సాధించాలి.
    2. MS ఆఫీస్, ఫైనాన్షియల్ మోడలింగ్ వంటి కంప్యూటర్ నైపుణ్యాలు కలిగి వుండాలి.
    3. బ్యాంకులు / ఫైనాన్స్ సంస్థలలో సంబంధిత విభాగంలో ఒక సంవత్సర అనుభవం కలిగి వుండాలి.
  1. అసిస్టెంట్ మేనేజర్ (లా) :
    1.  ఏదైనా యూనివర్సిటీ నుండి 50 శాతం మార్కులతో లా డిగ్రీ ఉత్తీర్ణత లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ లా కోర్సు ఉత్తీర్ణత సాధించి వుండాలి.
    2. MS ఆఫీస్ లో నైపుణ్యత కలిగి వుండాలి.
    3. వర్కింగ్ ఎక్పీరియన్స్ అవసరమగును.

🔥  వయస్సు :

  • అర్హత గల అభ్యర్థులు వయస్సు 21 సంవత్సరాలు నిండి వుండి 30 సంవత్సరాలలోపు గా వుండాలి.
  • ఎస్సీ , ఎస్టీ వారికి 5 సంవత్సరాలు
  • ఓబీసీ (నాన్ క్రిమి లేయర్) వారికి 3 సంవత్సరాలు
  • PWBD వారికి 10 సంవత్సరాలు
  • Ex – సర్వీస్ మాన్ వారికి 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 31/01/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులు 354/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • జనరల్ / బిసి అభ్యర్థులు 590/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.

🔥 ఎంపిక విధానం :

  • అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష  మరియు ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. 

🔥 ఆన్లైన్ పరీక్షా విధానం :

  • ఆన్లైన్ పరీక్ష 200 మార్కులకు గాను వుంటుంది.
  • రుణాత్మక మార్కుల విధానం కలదు.
  • ప్రొఫెషనల్ నాలెడ్జ్ (70 ప్రశ్నలు) , రీజనింగ్(15 ప్రశ్నలు) , క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (15 ప్రశ్నలు)  , ఇంగ్లీష్( 15 ప్రశ్నలు)  , జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ (15 ప్రశ్నలు)  సబ్జెక్టుల నుండి మొత్తం 130 ప్రశ్నలు వుంటాయి.
  • ప్రొఫెషనల్ నాలెడ్జ్ కు ఒక ప్రశ్నకు 2 మార్కులు & మిగతా అన్ని ప్రశ్నలకు 1 మార్కు చొప్పున కేటాయించారు.

🔥 పరీక్ష కేంద్రాలు

  • విజయవాడ , విశాఖపట్నం , రాజమండ్రి , కర్నూల్ , తిరుపతి , హైదరాబాద్ కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తారు.

🔥 జీతం

  • ఎంపిక కాబడిన వారికి ప్రతీ నెల 35,000/- రూపాయల కన్సాలిడేటెడ్ పే లభిస్తుంది.

🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 12/03/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 14/03/2025
  • ఆన్లైన్ వ్రాత పరీక్ష నిర్వహణ (తాత్కాలిక)  : మే 2025 

👉  Click here for notification 


👉 Click here to apply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!