బొగ్గు గనుల సంస్థలో భారీగా ఉద్యోగాలు భర్తీ | NCL Recruitment 2025 | Latest Jobs in Telugu

కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ కంపెనీ మరియు మినిరత్నం కంపెనీ అయిన నార్తర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సంస్థ నుండి డిగ్రీ , డిప్లొమా , ఐటిఐ ట్రెడ్ లలో అప్రెంటిస్ ట్రైనీ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

అన్ని విభాగాలలో మొత్తం 1765 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఈ ఉద్యోగాలకు ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా, మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🏹 AP లో అన్ని జిల్లాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు – Click here

✅ ఇలాంటి ఉద్యోగాలు సమాచారం మీ మొబైల్ కి రావాలంటే క్రింది ఇచ్చిన గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel

🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 

  • నార్తర్న్  కోల్ ఫీల్డ్ లిమిటెడ్ సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 

  • మొత్తం 1765 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:

  • అప్రెంటిస్ ట్రైనింగ్ – గ్రాడ్యుయేట్లు : 
  1. బ్యాచిలర్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 73
  2. బ్యాచిలర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ – 77
  3. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్ – 02
  4. బ్యాచిలర్ ఆఫ్ మైనింగ్ ఇంజనీరింగ్ – 75
  • అప్రెంటిస్ ట్రైనింగ్ – డిప్లొమా : 
  1. బ్యాక్ ఆఫీస్ మేనేజ్మెంట్ ( ఫైనాన్స్ & అకౌంటింగ్ ) – 40
  2. డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ – 125
  3. డిప్లొమా ఇన్ మెకానిక్ ఇంజనీరింగ్ – 136
  4. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 136
  5. డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ – 02
  6. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ – 78
  7. డిప్లొమా ఇన్ మోడ్రన్ ఆఫీస్ మేనేజ్మెంట్ అండ్ సెక్రటేరియట్ ప్రాక్టీసెస్ – 80
  • అప్రెంటిస్ ట్రైనింగ్ – ట్రేడ్ అప్రెంటిస్ (ఐటిఐ) :
  1. ఐటిఐ ఎలక్ట్రీషియన్ – 319
  2. ఐటిఐ ఫిట్టర్ – 455
  3. ఐటిఐ వెల్దర్ – 124
  4. ఐటిఐ టర్నర్ – 33
  5. ఐటిఐ మెకానిస్ట్ – 06
  6. ఐటిఐ ఎలక్ట్రీషియన్ ( ఆటో) – 04

🔥 విద్యార్హత :

ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

  1. అప్రెంటిస్ ట్రైనింగ్ – గ్రాడ్యుయేట్లు :
  • సంబంధిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
  1. అప్రెంటిస్ ట్రైనింగ్ – డిప్లొమా : 
  • సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
  1. అప్రెంటిస్ ట్రైనింగ్ – ట్రేడ్ అప్రెంటిస్ (ఐటిఐ) :
  • సంబంధిత విభాగంలో ఐటిఐ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.

🔥  వయస్సు :

  • 18 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల లోపు వయస్సు గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు & దివ్యాంగులు అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయో సడలింపు కలదు.
  • వయస్సు నిర్ధారణ కొరకు 01/03/2025 ను కట్ ఆఫ్ తేది గా నిర్ణయించారు.

🔥 దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.  

🔥 ఎంపికా విధానం:

  • అభ్యర్థులను సంబంధిత విద్యార్హత విభాగంలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 జీతం :

  • గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకి 9,000/- రూపాయలు లభిస్తుంది. 
  • డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి నెలకి 8,000/- రూపాయలు లభిస్తుంది. 
  • ఐటిఐ అప్రెంటిస్ ఉద్యోగాలలో వెల్డర్ ఉద్యోగాలకు 7700/- రూపాయలు & మిగతా అన్ని ఐటిఐ అప్రెంటిస్ వారికి 8050/- రూపాయలు లభిస్తుంది. 

 🔥 ముఖ్యమైన తేదిలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది : 12/03/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 18/03/2025
  • షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థుల మెరిట్ లిస్టు జాబితాను విడుదల చేయు తేది : 20/03/2025 లేదా 21/03/2025.

👉  Click here for notification


👉 Click here to apply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!