తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసిన నోటిఫికేషన్ నెంబర్ 03/2024 యొక్క ఫలితాలను బోర్డు మార్చి 10వ తేదీన విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షను 10-11-2024 తేదీన రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణాలలో బోర్డు ప్రశాంతంగా నిర్వహించింది. నవంబర్ 11వ తేదీన ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యర్థుల నుండి అభ్యంతరాలను నవంబర్ 14 సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ విధానంలో బోర్డు స్వీకరించింది.
అభ్యర్థుల నుండి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన బోర్డుకి చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ కమిటీ ప్రిలిమినరీ కిలో ఎటువంటి తప్పులు లేనందున ప్రిలిమినరీ ‘key ‘ ని ఫైనల్ ‘ కీ ‘ గా ప్రకటించింది.
అంతేకాకుండా అభ్యర్థులకు వచ్చిన మార్కులు వివరాలను అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు బోర్డు అధికారికి వెబ్సైట్లో నమోదు చేసి తెలుసుకోవచ్చు.
మరికొద్ది రోజుల్లో వెయిటేజీ పాయింట్స్ కలిపి అభ్యర్థులకు వచ్చిన మార్కులు వివరాలతో ప్రయోజనాలు మెరిట్ లిస్ట్ విడుదల చేయబోతున్నట్లుగా తాజాగా విడుదల చేసిన వెబ్ నోటీస్ లో బోర్డు ప్రకటించింది.
🏹 Download Web Notice – Click here
🏹 Click here for Lab technician Results