భారతదేశం లోని లీడింగ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ అయినటువంటి తమిళనాడ్ మెర్చంటైల్ బ్యాంక్ లిమిటెడ్ (TMB) సంస్థ నుండి సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ (SCSE) ఉద్యోగాల భర్తీ కొరకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో మార్చి 16వ తేదీలోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి అన్ని రకాల అలవంతులు కలుపుకొని నెలకు నెలకు 72061/- రూపాయల జీతం లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో పాటు తెలుగు వచ్చినవారు అర్హులు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 IOCL లో భారీ జీతంతో ఉద్యోగాలు – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- తమిలాండ్ మెర్చంటైల్ బ్యాంక్ లిమిటెడ్ ( TMB) నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- దేశవ్యాప్తంగా 124 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
- ఆంధ్రప్రదేశ్ లో 21, తెలంగాణ లో 18 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు:
- TMB విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
🔥 విద్యార్హత :
- 31/01/2025 తేది నాటికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా సబ్జెక్టులో 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వుండాలి.
🔥 గరిష్ఠ వయస్సు :
- 31/01/2025 తేది నాటికి 30 సంవత్సరాలు దాటి వుండరాదు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ విధానం లో అప్లై చేయాలి.
🔥 అప్లికేషన్ ఫీజు :
- అభ్యర్థులు 1000/- రూపాయల అప్లికేషన్ ఫీజు ను ఆన్లైన్ విధానం ద్వారా చెల్లించాలి.
🔥 జీతం :
- ఈ పోస్టులకి ఎంపికైన వారికి నెలకు అన్ని రకాల అలవెన్స్లు కలిపి నెలకు 72061/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులను ఐబీపీఎస్ స్టాండర్డ్స్ ఆధారిత వ్రాత పరిక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
- వ్రాత పరీక్ష లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
🏹 ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ – Click here
🔥 వ్రాత పరీక్ష విధానం :
- వ్రాత పరీక్ష లో 150 ప్రశ్నలను 150 మార్కులకు గాను నిర్దేశించారు. 120 నిమిషాల సమయంలో పరీక్ష ను పూర్తి చేయాల్సి వుంటుంది.
🔥 పరీక్ష కేంద్రాలు :
- దేశం లోని ప్రముఖ నగరాలలో పాటు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ,విశాఖ పట్నం మరియు తెలంగాణ లో హైదరాబాద్ లో పరీక్ష నిర్వహిస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 28/02/2025
- ఆన్లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేది : 16/03/2025
- ఆన్లైన్ పరీక్ష నిర్వహణ : ఏప్రిల్ 2025