ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ నుండి జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలను మెకానికల్ ఇంజనీరింగ్, నావెల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్ / CFD , కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న జాబ్స్ కు అర్హత ఉన్నవారు స్వయంగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది.
రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే స్వయంగా ఇంటర్వ్యూ కి వెళ్ళండి.
🏹 ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టు ఉద్యోగాలు భర్తీ – Click here
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం కోసం మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 నోటిఫికేషన్ జారీ చేసిన సంస్థ :
- డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) యొక్క నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబ్ , విశాఖపట్నం నుండి విడుదలైంది.
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఏడు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- జూనియర్ రీసెర్చ్ ఫెలో అనే ఉద్యోగాలను మెకానికల్ ఇంజనీరింగ్, నావెల్ ఆర్కిటెక్చర్, ఎలక్ట్రానిక్స్, ఏరో స్పేస్ / CFD , కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి సంబంధిత సబ్జెక్టులలో బిఈ లేదా బిటెక్ మొదటి శ్రేణిలో పూర్తి చేసి వ్యాలిడ్ నెట్ లేదా గేట్ స్కోర్ కలిగి ఉండాలి. (లేదా)
- సంబంధిత సబ్జెక్టులలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. మొదటి శ్రేణిలో గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుకేషన్ పూర్తి చేసి ఉండాలి.
🏹 వయస్సు :
- ఈ ఉద్యోగాలకు 28 సంవత్సరాల్లో వయస్సు ఉన్నవారు అర్హులు.
- ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనలో ప్రకారం వయస్సులో సడలింపు వర్తిస్తుంది.
🏹 ఇంటర్వ్యూ తేదీలు :
- నావెల్ ఆర్కిటెక్చర్, ఏరో స్పేస్ / CFD , కంప్యూటర్ సైన్స్ విభాగంలో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు ఫిబ్రవరి 19వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
- మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలకు ఫిబ్రవరి 20వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
🏹 APPSC 8 నోటిఫికేషన్స్ సమాచారం – Click here
🏹 జీతం :
- 37,000/- జీతము మరియు ఇంటి అద్దె భత్యం కూడా ఇస్తారు.
🏹 అప్లికేషన్ ఫీజు :
- “Director, NSTL” payable at Visakhapatnam అనే పేరు మీద 10/- రూపాయలు డిడి లేదా IPO చెల్లించాలి. లేదా ఆన్లైన్లో కూడా ఫీజు చెల్లించవచ్చు.
- ఎస్సీ , ఎస్టీ , ఓబిసి అభ్యర్థులకు ఫీజు లేదు
🏹 ఇంటర్వ్యూకు పట్టుకుని వెళ్లాల్సిన సర్టిఫికెట్స్ :
- క్రింద తెలిపిన సర్టిఫికెట్స్ ఒరిజినల్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- విద్యార్ధుల సర్టిఫికెట్స్
- పదో తరగతి లేదా పుట్టిన తేదీ సర్టిఫికెట్
- వ్యాలీడ్ నెట్ లేదా గేట్ స్కోర్ కార్డు
- వ్యాలీడ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికెట్
- ఫోటో ఐడి కార్డు
- రెండు తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
- అప్లికేషన్ ఫీజు చెల్లించిన DD / IPO
🏹 ఇంటర్వ్యూ అడ్రస్ :
- Naval Science & Technological Laboratory, Vigyan Nagar, Near N.A.D. Junction ,Visakhapatnam, Andhra Pradesh – 530027
🔥 Download Full Notification – Click here