భారత ప్రభుత్వ , మినిస్ట్రీ ఆఫ్ కోల్ పరిధి లో గల నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజ్ నైవెలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( NLC) సంస్థ నుండి 2024- 25 సంవత్సరానికి గాను గ్రాడ్యుయేట్ మరియు టెక్నీషియన్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ కి సంబంధించి , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- నైవెలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్ ( NLC) సంస్థ నుండి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది
🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 588
🏹 AP లో రేషన్ డీలర్ల నియామకాలు – Click here
🔥 భర్తీ చేయబోయే పోస్టులు :
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ – 336
- టెక్నీషియన్ అప్రెంటిస్ – 252
🔥 విద్యార్హత :
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ :
- అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
- నర్సింగ్ గ్రాడ్యుయేట్ అభ్యర్థులు బి.ఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించి వుండాలి.
డిప్లొమా అప్రెంటిస్ :
- అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి వుండాలి.
🔥 వయస్సు :
- అప్రెంటిస్‌షిప్ నిబంధనల ప్రకారం వయో పరిమితిని అనుసరిస్తారు.
🔥దరఖాస్తు విధానం :
- అభ్యర్థులు మొదటిగా ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆ తర్వాత ఆ ప్రింటెడ్ అప్లికేషన్ ను ప్రింట్ తీసి , సంబంధిత ధృవపత్రాలు జత చేసి , పోస్ట్ ద్వారా లేదా నేరుగా ఈ క్రింద తెలిపిన చిరునామాకు పంపించాలి.
🔥 దరఖాస్తు చేరవలసిన చిరునామా:
- Office of The General Manager,
Learning and Development Centre,
Block-20, NLC India Limited, Neyveli – 607 803.
🔥 దరఖాస్తు తో పాటు జతచేయవలసిన ధృవపత్రాలు:
- అప్లికేషన్ ఫారం ( సంతకం చేయాలి)
- SSLC / HSC మార్క్ షీట్
- కుల ధృవీకరణ పత్రం
- డిగ్రీ / డిప్లొమా సర్టిఫికెట్
- ప్రతి సెమిస్టర్ మార్క్ షీట్ / కన్సాలిడేటెడ్ మార్క్ షీట్
- వికలాంగ దృవీకరణ పత్రం ( అవసరమగు వారు )
- ఎక్స్ సర్వీస్ మాన్ ధృవ పత్రం (అవసరమగు వారు )
- మార్కుల శాతం తెలుపు ఫార్మాట్
🏹 డిగ్రీ అర్హతతో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ – Click here
🔥 ఎంపిక విధానం :
- అభ్యర్థులకు ఎటువంటి వ్రాత పరిక్ష , ఇంటర్వ్యూ లేకుండా కేవలం వారి విద్యార్హత మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 జీతం:
- గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటిస్ ట్రైనీ గా ఎంపిక కాబడిన వారికి 15028/- రూపాయలు, బి . ఎస్సీ నర్సింగ్ వారికి 12524/- రూపాయలు జీతం లభిస్తుంది.
- టెక్నీషియన్ అప్రెంటిస్ ట్రైనీ గా ఎంపిక కాబడిన వారికి 12524/- రూపాయలు జీతం లభిస్తుంది.
🔥 ముఖ్యమైన అంశాలు:
- సంబంధిత ఉద్యోగాలు ఒక సంవత్సరం కాలపరిమితికి గాను నియమించనున్నారు.
- 2020 , 2021 , 2022 , 2023 , 2024 లో ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవలెను.
- తమిళనాడు , ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , కేరళ , లక్షద్వీప్ , పుదుచ్చేరి రాష్ట్ర అభ్యర్థులు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
🔥 ముఖ్యమైన తేదిలు:
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేది : 09/12/2024 ఉదయం 10:00 గంటల నుండి
- ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేయడానికి చివరి తేది : 23/12/2024 సాయంత్రం 5:00 గంటల లోగా
- హార్డ్ కాపీ ని కార్యాలయ చిరునామాకు చేరవేయడానికి చివరి తేది : 03/01/2025 సాయంత్రం 5:00 గంటల లోగా