10+2 అర్హతతో సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | CSIR – NIO Recruitment 2024 | Latest Govt Jobs 2024

మీరు 10+2 విద్యార్హత కలిగి ఉండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారా ? అయితే ఈ ఆర్టికల్ పూర్తిగా చివరి వరకు చదివి ఈ ఉద్యోగాలకు వెంటనే అప్లై చేయండి. 

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన CSIR-National Institute of Oceanography (CSIR-NIO) నుండి జూనియర్స్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత గల భారతీయ పౌరులు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 19

ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము, జీతము , పరీక్ష విధానము , అప్లికేషన్ ప్రారంభ తేదీ, అప్లికేషన్ చివరి తేదీ, అప్లై చేసే విధానము వంటి వివిధ రకాల ముఖ్యమైన వివరాలు ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకి త్వరగా అప్లై చేయండి. 

పూర్తి నోటిఫికేషన్ తో పాటు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి ఆర్టికల్ చివర్లో లింక్స్ ఇవ్వడం జరిగింది

✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాల సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

🏹  ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : CSIR-National Institute of Oceanography (CSIR-NIO)

🔥 భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :  CSIR-National Institute of Oceanography (CSIR-NIO) అనే సంస్థలో జూనియర్స్ స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు.

🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య : 09 పోస్టులు 

🔥 అర్హతలు : క్రింది విధంగా ఈ ఉద్యోగాలకు అర్హత ఉండాలి. 👇 👇 👇 

  • జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు 10+2 విద్యార్హతతో పాటు స్టేనోగ్రఫీ వచ్చి ఉండాలి. 
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు 10+2 విద్యార్హతతో పాటు కంప్యూటర్ నందు టైపింగ్ వచ్చి ఉండాలి.

🔥 వయస్సు : 

  • జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు.
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 28 సంవత్సరాలు.

🔥 వయస్సులో సడలింపు : 

  • ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు వయసులో సడలింపు ఇస్తారు. 
  • ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయస్సులో చదివింపు ఇస్తారు.
  • PwBD అభ్యర్థులకు వయస్సులో 10 సంవత్సరాలు సడలింపు వర్తిస్తుంది.

🔥 జీతము : పోస్టుల వారీగా పే స్కేల్ క్రింది విధంగా ఉంటుంది.

  • జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు పే స్కేల్ లెవల్ – 4 ప్రకారం 25,500/- నుండి 81,100/- వరకు ఉంటుంది. 
  • జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలకు పే స్కేల్ లెవెల్ – 2 ప్రకారం 19,900/- నుండి 63,200/- వరకు ఉంటుంది. 

🔥 అప్లికేషన్ ఫీజు : 

  • UR / OBC / EWS అభ్యర్థులకు ఫీజు 100/- రూపాయలు
  • SC, ST, PwBD , ESM మరియు మహిళ అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు ఇచ్చారు. అంటే ఈ కేటగిరీ అభ్యర్థులు ఫీజు చెల్లించకుండానే అప్లికేషన్ పెట్టుకోవచ్చు.

🔥 ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ : 20-08-2024 నుండి ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానాలు అప్లై చేయవచ్చు.

🔥 ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేదీ : 19-09-2024 వరకు ఆన్లైన్ లో ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చు.

🔥 అప్లికేషన్ పోస్టు ద్వారా పంపించటకు చివరి తేదీ : 30-09-2024

🔥 అప్లికేషన్ విధానం : ఈ ఉద్యోగాలకు అర్హత గల వారి తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ ప్రింట్ ను పోస్ట్ ద్వారా పంపించాలి.

🔥 ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు పోస్టులను అనుసరించి స్కిల్ టెస్ట్ నిర్వహించి ఎంపిక చేస్తారు.

🔥 పరీక్ష విధానం : పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు 200 మార్కులకు ఇస్తారు. రుణాత్మక మార్కుల విధానం కూడా అమలులో ఉంటుంది.

🔥 గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు క్రింది ఇచ్చిన లింకుపై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివి అర్హత ఉంటే ఆన్లైన్ లో అప్లై చేయండి.

🏹 Download Notification – Click here 

🏹 Apply Online – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!