దేశవ్యాప్తంగా ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ NORCET 7 నోటిఫికేషన్ ను ఆగస్టు 1వ తేదీన విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు అర్హులైన వారి నుంచి ఆగస్టు 1వ తేది నుండి 21వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించడం జరిగింది.
ఆగస్టు 22 నుండి 24వ తేదీ మధ్య అప్లికేషన్స్ సబ్మిట్ చేసిన సమయంలో ఏమైనా తప్పులు చేసి ఉన్నవారికి సవరించుకునే అవకాశం ఇచ్చారు.
✅ ఫ్రెండ్స్ మీ WhatsApp / Telegram కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ / టెలిగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
NORCET 7 నోటిఫికేషన్ విడుదల చేసిన సమయంలోనే ఈ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియలో నిర్వహించే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు ప్రకటించడం జరిగింది. నోటిఫికేషన్ లో సెప్టెంబర్ 15వ తేదీన ప్రిలిమ్స్ , అక్టోబర్ 4వ తేదీన మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. సెప్టెంబర్ 24వ తేదీన ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించడం జరిగింది.
అయితే నోటిఫికేషన్ లో మొత్తం ఖాళీల సంఖ్య ప్రకటించలేదు. కానీ ఇప్పుడు ఖాళీలు లిస్ట్ ప్రకటించడం జరిగింది.
ఈ లిస్టు ప్రకారం దేశవ్యాప్తంగా వివిధ ఎయిమ్స్ లలో మొత్తం 1487 ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన ఈ లిస్టులో రిజర్వేషన్ల వారీగా మరియు ఎయిమ్స్ వారీగా ఉన్న ఖాళీలు సమాచారంతో పాటు అందులో పురుషులకు , మహిళలకు, PwBD అభ్యర్థులకు కేటాయించిన పోస్టుల సంఖ్య కూడా స్పష్టంగా తెలియజేశారు.

NORCET 7 నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ లో మంగళగిరిలోఉన్న ఎయిమ్స్ లో 114 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయబోతున్నారు.
🔥 ఖాళీలు లిస్టు డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
🏹 Download NORCET 7 Vacancies List
▶️ NORCET 7 కు ప్రిపేర్ అవుతున్న వారి కోసం మన యాప్ లో తక్కువ ఫీజు తో ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాం. యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితే కోర్స్ తీసుకోండి.
🔥 Download Our App – Click here