ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వలంటీర్ పోస్టుల రిక్రూట్మెంట్ కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇప్పటివరకు వలంటీర్ పోస్టుల కొనసాగింపు ఉంటుందా ? లేదా అనే సందేహానికి దాదాపుగా తెరపడినట్లుగానే చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై ఒక క్లారిటీ వచ్చింది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా వలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎమ్మెల్యే శివప్రసాద్ గారు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి గారు స్పందిస్తూ వలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
వలంటీర్ల జీతం 10,000/- కు పెంచే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వ పరిశీలనలో ఉంది అని , త్వరలో జీతం పెంపు ఉంటుందని ఆయన తెలిపారు.
✅ ఫ్రెండ్స్ మీ వాట్సాప్ / టెలిగ్రామ్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 ఖాళీల వివరాలు : గతంలో ఉన్న సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్ లో దాదాపుగా 70 వేల వలంటీర్ పోస్టులు నియమించాల్సి ఉంది.
మరోవైపు చూస్తే వలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం వద్ద కొన్ని ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. వాటిలో వలంటీర్లను ఇకపై సేవక్ అనే పేరుతో పిలవడంతో పాటు ప్రతి వలంటీర్ కు 100 ఇల్లు చొప్పున కేటాయించడం , ప్రతి మూడేళ్లకు ఒకసారి వలంటీర్ పోస్ట్ల కొత్త రిక్రూట్మెంట్ వంటి ముఖ్యమైన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి.
ప్రభుత్వం ముందు ఈ పోస్టులు భర్తీకి సంబంధించి ఉన్న ప్రతిపాదనల పూర్తి సమాచారం కోసం క్రింది ఉన్న లింకుపై క్లిక్ చేయండి.
🔥 వలంటీర్ పోస్ట్లు – కొత్త ప్రతిపాదనలు ఇవే