AP నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు – ప్రభుత్వము కీలక నిర్ణయం | AP Skill Census – 2024 | Latest jobs in Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో హామీని నిలబెట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజే స్కిల్ సెన్సెస్ – 2024 ఫైల్ పై తన ఐదవ సంతకం చేశారు. 

ఈ స్కిల్ సెన్సెస్ – 2024 దేనికోసం అంటే రాష్ట్రంలో ప్రస్తుతం యువతకు ఉన్న నైపుణ్యం , పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. 

ముఖ్యమంత్రి గారు ఈ ఫైల్ పై సంతకం చేసిన తర్వాత స్కిల్స్ సెన్సెస్ – 2024 కు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ స్కిల్స్ సెన్సెస్ – 2024 కు సంబంధించి నోడల్ ఏజెన్సీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 

ఈ సెన్సస్ లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతలో ఉన్న నైపుణ్యాలను గుర్తించడమే కాకుండా వారికి ఎటువంటి నైపుణ్య శిక్షణ అవసరం అవుతుంది ? ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం చేయాలి ? అసలు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు ఏమిటి ? అనేవి నిర్ణయిస్తారు. 

ఇవన్నీ నిర్ణయించాక పాలసీని తీసుకురావడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడమే ఈ స్కిల్ సెన్సెస్ – 2024 లక్ష్యం.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే.

RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only. 

బ్యాంక్ , SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం 499/- 

🔥 Download Our App 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.

📌 Join Our What’s App Channel 

📌 Join Our Telegram Channel 

__________________________________

▶️ మరి కొన్ని ఉద్యోగాల సమాచారం కోసం క్రింద లింక్స్ పైన క్లిక్ చేయండి.

🏹 AP ప్రభుత్వం ద్వారా ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు

🏹 DRDO 37,000/- జీతంతో ఉద్యోగాలు

🏹 AP లో రైల్వే స్టేషన్స్స్ లో టికెట్స్ ఇచ్చే పోస్టులు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!