ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ను 2023లో డిసెంబర్ 7వ తేదీన విడుదల చేశారు. డిసెంబర్ 21వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు. నోటిఫికేషన్ విడుదల సమయంలో 897 ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. తర్వాత పోస్టుల సంఖ్య 905 కు చేరింది.
APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..
APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్సు – 499/- రూపాయలకే
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్ లో పోస్టుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి. ఇందులో ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు – 331 ఉన్నాయి. నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు 566 ఉన్నాయి.
- డిప్యూటీ తహసిల్దార్ – 114
- ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ – 150
- గ్రేడ్ 3 మున్సిపల్ కమిషనర్ – 04
- గ్రేడ్ 2 సబ్ రిజిస్ట్రార్ – 16
- అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ – 28
వీటితోపాటు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ , సీనియర్ ఆడిటర్, ఆడిటర్ ఇన్ పే అండ్ అకౌంట్స్ మరియు జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు 4,83,525 మంది అప్లై చేసుకున్నారు.
అప్లై చేసుకున్న అభ్యర్థుల్లో 4,04,039 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు.
అనేక కారణాల వలన ప్రిలిమ్స్ పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని అభ్యర్థులు ఏపీపీఎస్సీకి తెలిపారు. ఇందులో ముఖ్యంగా నోటిఫికేషన్ జారీకి , ప్రిలిమ్స్ మధ్య ఉన్న తక్కువ సమయం సన్నద్ధతకు సరిపోకపోవడం, ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం, ‘భారతీయ సమాజం’ సిలబస్ కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావడం వంటి కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు పేర్కొన్నారు. ఇటువంటి కారణాల వలన ఒక్కోపోస్టుకు 50 మంది చొప్పున కాకుండా 100 మంది చొప్పున మెయిన్స్ కి ఎంపిక చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఏపీపీఎస్సీ కూడా ఒక్కో పోస్టుకు 100 మంది నిష్పత్తిలోనే ఎంపిక చేయడానికి నిర్ణయించింది.
తాజా విడుదల చేసిన ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అభ్యర్థుల లిస్టులో 1:100 నిష్పత్తిలోనే 92,250 అభ్యర్థులను ఎంపిక చేసింది. ( 2018 లో ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కు ఒక్క పోస్ట్ కు 1:12 నిష్పత్తిలో ఎంపిక చేశారు ) . ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కు ఎక్కువ సంఖ్యలో ఎంపిక చేయడం ఏపీపీఎస్సీ చరిత్రలో ఇదే మొదటిసారి.
అలాగే జూలై 28వ తేదీన మెయిన్స్ పరీక్ష నిర్వహించబోతున్నట్లుగా ఏపీపీఎస్సీ ప్రకటించింది.
గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ను క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్టులో చెక్ చేసుకుని మెయిన్స్ కు ప్రిపరేషన్ ప్రారంభించండి.
🔥 Download Qualified Candidates List
🔥 Download Rejection Candidates List