APPSC Group 2 Prelims Results Released | APPSC Group 2 Mains Exam Date| APPSC Group 2 Prelims Cut Off

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు.

897 ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు 4,83,525 మంది అప్లై చేసుకున్నారు.

✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/-

✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/- 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

  • అప్లై చేసుకున్న అభ్యర్థుల్లో 4,04,037 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. 
  • ప్రశ్న పత్రం కఠినంగా రావడం వలన అభ్యర్థులు ఒక్కోపోస్టుకు 100 మంది చొప్పున మెయిన్స్ కి ఎంపిక చేయాలని ఏపీపీఎస్సీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఏపీపీఎస్సీ కూడా ఒక్కో పోస్టుకు 100 మంది చొప్పున మెయిన్స్ కి ఎంపిక చేయడానికి నిర్ణయించింది. 
  • అనేక కారణాల వలన ప్రిలిమ్స్ పరీక్ష సరిగ్గా రాయలేకపోయామని అభ్యర్థులు ఏపీపీఎస్సీకి తెలిపారు. ఇందులో ముఖ్యంగా నోటిఫికేషన్ జారీకి , ప్రిలిమ్స్ మధ్య ఉన్న తక్కువ సమయం సన్నద్ధతకు సరిపోకపోవడం, ప్రశ్నపత్రం కఠినంగా ఉండడం, ‘భారతీయ సమాజం’ సిలబస్ కు సంబంధించిన పుస్తకాలు మార్కెట్లో ఆలస్యంగా రావడం వంటి కారణాలతో ఇబ్బంది పడ్డామని అభ్యర్థులు పేర్కొన్నారు. ఇటువంటి కారణాల వలన ఒక్కోపోస్టుకు 50 మంది చొప్పున కాకుండా 100 మంది చొప్పున మెయిన్స్ కి ఎంపిక చేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.
  • తాజా విడుదల చేసిన ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అభ్యర్థుల లిస్టులో 1:100 నిష్పత్తిలోనే 92,250 అభ్యర్థులను ఎంపిక చేసింది.

అలాగే జూలై 28వ తేదీన మెయిన్స్ పరీక్ష నిర్వహించబోతున్నట్లుగా ఫలితాల సందర్భంగా ఏపీపీఎస్సీ ప్రకటించింది.

గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ హాల్ టికెట్ నెంబర్ ను క్వాలిఫై అయిన అభ్యర్థుల లిస్టులో చెక్ చేసుకుని మెయిన్స్ కు ప్రిపరేషన్ ప్రారంభించండి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!