తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలో భారీ స్థాయిలో పోస్టులు భర్తీ జరగబోతుంది. తెలంగాణ ఆర్టీసీలో 3,500 ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్లు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వెల్లడించారు. మరో వెయ్యి కొత్త బస్సులు కూడా తీసుకొస్తున్నట్లుగా ఆయన తెలిపారు.
తెలంగాణ ఆర్టీసీలో మహాలక్ష్మి పథకం ప్రవేశం పెట్టడం వలన ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అలాగే ప్రతి సంవత్సరం ఆర్టీసీలో ఉద్యోగుల పదవీ విరమణలు కూడా జరుగుతున్నాయి. గత పదిహేళ్లుగా చూస్తే కారుణ్య నియామకాలు తప్ప డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఏవి కూడా ఆర్టీసీ విడుదల చేయలేదు.
ప్రస్తుతం ఆర్టీసీలో ఇలా చాలా కారణాల వలన భారీగా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలు భర్తీకి ప్రభుత్వం ప్రస్తుతం పరిశీలిస్తుంది. తెలంగాణ ఆర్టీసీ కూడా ఖాళీలు భర్తికి సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపింది.
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్లైన్ కోచింగ్ ఇప్పుడు మన “ INB Jobs “ APP లో కేవలం 499/- రూపాయలకు మాత్రమే..
RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగాలకు సిలబస్ ప్రకారం ఆన్లైన్ Classes మరియు ప్రాక్టీస్ టెస్ట్ లతో పూర్తి కోర్స్ – 499/- Only
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రతిపాదించిన ఖాళీలు భర్తీకి సంబంధించిన దస్త్రాన్ని పరిశీలిస్తున్నామని , ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులపై పని భారాన్ని కూడా తగ్గిస్తామని రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రావు గారు తెలిపారు.
కొత్తగా భర్తీ చేయబోయే పోస్టుల్లో మూడింట రెండు వంతులు డ్రైవర్ పోస్ట్లు ఉన్నాయి. కండక్టర్ పోస్ట్లు తక్కువగా ఉండే అవకాశం ఉంది.
- ప్రస్తుతం తెలంగాణ ఆర్టీసీలో 42,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 14,747 మంది డ్రైవర్లు ఉన్నారు. 17,410 మంది కండక్టర్లు ఉన్నారు.
తాజాగా ప్రతిపాదించిన పోస్టులు ఖాళీలు వివరాలు ఇవే 👇👇👇
- డ్రైవర్ – 2,000
- శ్రామిక్ – 743
- డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానిక్) – 114
- డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) – 84
- డిఎం / ఏటీఎం / మెకానికల్ ఇంజనీర్ – 40
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23
- మెడికల్ ఆఫీసర్ – 14
- సెక్షన్ ఆఫీసర్ (సివిల్) – 11
- అకౌంట్స్ ఆఫీసర్ – 06
పైన ప్రతిపాదించిన పోస్టులకు త్వరలో అనుమతి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది.