ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి తాజాగా ఒక వెబ్ నోట్ విడుదలైంది. ఈ వెబ్ నోట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గతంలో విడుదల చేసిన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన ప్రాథమిక రాత పరీక్ష వాయిదా వేశారు.
ఈ వెబ్ నోట్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీ జె.ప్రదీప్ కుమార్ గారు విడుదల చేశారు. దీని ప్రకారం ..
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2023 లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు 14/2023 నెంబర్ గల నోటిఫికేషన్ విడుదల చేసింది. 2024లో ఏప్రిల్ 13వ తేదీన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ప్రాథమిక రాత పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించడం కూడా జరిగింది.
అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు మరియు డీఎస్సీ పరీక్షలు కారణంగా అభ్యర్థుల నుంచి వచ్చిన వినతుల మేరకు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు మే 25వ తేదీన పరీక్ష నిర్వహించబోతున్నట్టుగా ప్రకటన జారీ చేశారు.
APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..
APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్సు – 499/- రూపాయలకే
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..