ఏపీపీఎస్సీGroup 2 : మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయండి | APPSC Group – 2 Latest News Today | APPSC Group -2 Mains

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కు 1:100 నిష్పత్తిలో ఎంపిక చేయాలని పరీక్ష రాసిన అభ్యర్థుల నుండి ఏపీపీఎస్సీ కు వినతులు వెల్లువెత్తుతున్నాయి.

గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో ప్రశ్నలు చాలా కఠినంగా ఉండడం, నోటిఫికేషన్ తరువాత పరీక్షకు సన్నద్ధమైనందుకు ఎక్కువ సమయం లేకపోవడం, కొత్తగా చేర్చిన ‘ భారతీయ సమాజం ’ చదవడానికి అభ్యర్థులకు తగిన సమయం లేకపోవడం వంటి అనేక కారణాల వలన పరీక్ష రాసిన అభ్యర్థులు ఎక్కువ మార్కులు పొందలేకపోయారు. 

APPSC గ్రూప్ 2 కోర్స్ ఇప్పుడు కేవలం – 399/- రూపాయలకే..

APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్సు – 499/- రూపాయలకే 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

📌 Download Our APP 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel

కాబట్టి పరీక్ష రాసిన అభ్యర్థులు 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేయాలని నిరుద్యోగులు మరియు నిరుద్యోగ సంఘాల నుంచి అధిక సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు వినతులు అందుతున్నాయి.

అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్ కు అనుమతిస్తామని ఏపీపీఎస్సీ ఇప్పటికే తెలిపింది. అయితే పై కారణాల వలన అభ్యర్థులు ఒక్కో పోస్ట్ కు 100 మంది చొప్పున మెయిన్స్ కి అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు.

త్వరలో జరిగే గ్రూప్-1 ప్రిలిమ్స్ అనంతరం ఏపీపీఎస్సీ సమావేశం అయ్యి గ్రూప్-2 పై చర్చించే అవకాశం ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!