తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు తెలంగాణలోని జిల్లాల వారీగా కాంట్రాక్ట్ మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ వరుస నోటిఫికేషన్స్ విడుదలవుతున్నాయి. తాజాగా 97 పోస్టులతో మరో జిల్లాలో నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు
జిల్లాల వారీగా ఉద్యోగాల సమాచారాన్ని తెలుసుకోవడానికి , జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఉన్న ‘ అన్ని నోటిఫికేషన్ లింక్ ‘ పై క్లిక్ చేయండి
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ప్రతీ జిల్లాలో జిల్లా ఎంపిక కమిటీల ద్వారా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టుల ఎంపిక లో రాత పరీక్ష లేదు. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమె ఎంపిక చేస్తున్నారు.
తాజాగా సిద్దిపేట జిల్లా నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి 👇👇👇
ఈ నోటిఫికేషన్ లో జిల్లా , జోనల్, మల్టీ జోనల్ స్థాయి పోస్టులు ఉన్నాయి.
🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా వైద్య ఆరోగ్య శాఖ , సిద్దిపేట జిల్లా
🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 97
🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ): కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు
🔥 పోస్టుల పేర్లు మరియు జీతాలు :
మెడికల్ ఆఫీసర్ , పీడియాట్రిషన్ , క్వాలిఫికేషన్ మేనేజర్, MLHP, స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, ANM, ఫిజియోతెరపిస్ట్ ,ఫిజీషియన్, సపోర్టింగ్ స్టాఫ్
🔥 అర్హతలు : అర్హతలకు సంబంధించిన వివరాలు నోటిఫికేషన్ చూసి తెలుసుకోండి.
🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 14-03-2024
🔥 కనీస వయస్సు : 18 సంవత్సరాలు (01-07-2024 నాటికి)
🔥 గరిష్ట వయస్సు : 46 సంవత్సరాలు (01-07-2024 నాటికి)
🔥 వయస్సు సడలింపు :
తెలంగాణ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది. అనగా
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు
- విభిన్న ప్రతిభావంతులైన అభ్యర్థులకు పది సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : మెరిట్ మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు
🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
🔥 ఫీజు: లేదు
🔥 అప్లికేషన్ అందజేయాల్సిన చిరునామా : DMHO, సిద్దిపేట ( ఆఫీస్ నం:30) .
🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అర్హత ఉంటే అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.