ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్-2 ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1327 పరీక్ష కేంద్రాల్లో గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తున్నారు.
గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి గారు జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలు మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలు ఉండాలని ఆదేశించారు.
గ్రూప్-2 ప్రిలిమ్స్ నిరంతర పర్యవేక్షణకు మరియు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు.
APPSC Group 2 సిలబస్ ప్రకారం పూర్తి క్లాస్ లు , Pdf మెటీరియల్స్, ప్రాక్టిస్ టెస్ట్స్ మొత్తం – 399/-
APPSC Forest Beat Officer కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నిరంతర పర్యవేక్షణ కోసం 24 మంది ఐఏఎస్ అధికారులను, 450 మంది రూట్ అధికారులు, 51 మంది ఏపీపీఎస్సీ అధికారులు, 1330 మంది లైజినింగ్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
24,142 మంది ఇన్విజిలేటర్లను , మరో 8500 మంది ఇతర సిబ్బందిని ఆయా పరీక్ష కేంద్రాల్లో నియమించడం కూడా జరిగింది.
పరీక్షలను పటిష్ట బందోబస్తు మధ్య నిర్వహించడానికి 3971 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. అలాగే పరీక్ష పత్రాలు, జవాబు పత్రాలు మరియు ఇతర మెటీరియల్ ను తరలించేందుకు 900 మంది ఎస్కార్ట్ సిబ్బందిని కూడా నియమించారు.
గ్రూప్-2 పరీక్షలు నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 1327 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
మొత్తం 897 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హులైన 4,83,525అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకున్నారు. ఈ పోస్టులకు మరో రెండు పోస్టులు తర్వాత కలిపారు. ఒక్కో పోస్టుకు దాదాపు 537 మంది పోటీ పడుతున్నారు.
ఏపీపీఎస్సీ సభ్యుడైన పరీగే సుధీర్ గారిని ‘X’ (Twitter) లో మెయిన్స్ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు అని అడగగా దానికి నాలుగు నెలల సమయం పడుతుందని ఆయన రిప్లై ఇచ్చారు.
ప్రిలిమ్స్ పరీక్ష పూర్తయిన తర్వాత ప్రాథమిక “కి” ఏపీపీఎస్సీ సాధ్యమైనంత త్వరగా విడుదల చేసి దానిపైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తుంది. తరువాత తుది “కి“ వెల్లడిస్తుంది.