ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక ముఖ్యమైన వార్త. గత కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల కావడం లేదు. ఇటీవల కాలంలో కేవలం కారుణ్య నియామకాలు మాత్రమే చేపట్టారు.
ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆర్టీసీ చైర్మన్ మరియు ఆర్టీసీ ఎండీ విలేకరుల సమావేశంలో కొన్ని వివరాలు తెలిపారు. దాని ప్రకారం.
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో 3,200 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు ప్రభుత్వ అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి మరియు ఎండి ద్వారకా తిరుమలరావు ఒక ప్రకటనలో తెలిపారు.
పేద నిరుద్యోగులు కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీ తో అతి తక్కువ ధరలో ఆన్లైన్ క్లాసెస్..
✅ APPSC గ్రూప్ 2 పూర్తి కోర్సు – 399/- మాత్రమే.
AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్స్ – 499/-
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
అన్నమయ్య జిల్లాలో ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోల్ బంకును ప్రారంభించిన సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ మరియు ఆర్టీసీ ఎండీ కొన్ని ముఖ్యమైన వివరాలు తెలిపారు. వారు చెప్పిన వివరాలు ప్రకారం ప్రయాణికులకు సురక్షితమైన సేవలు అందించేందుకు 1500 కొత్త బస్సులు కొనుగోలు చేశామని ఆర్టీసీ ఎండీ మరియు చైర్మన్ తెలిపారు. వచ్చే వారం రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ముందుగా 100 బస్సులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా ఉద్యోగాల ఖాళీలపై మరియు వాటి భర్తీపై కూడా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో రిటైర్మెంట్స్ మరియు కొత్త ఖాళీలను దృష్టిలో పెట్టుకొని 3,200 డ్రైవర్ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి కోరామని , అనుమతులు వచ్చిన వెంటనే ఈ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే మన “ INB jobs ” వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ వివరాలు మీకు తెలియజేస్తాం.
అర్హతలు : గత నోటిఫికేషన్స్ పేర్కొన్న వివరాల ప్రకారం
ఈ డ్రైవర్ పోస్ట్ లకు పదవ తరగతి అర్హతతో పాటు హెవీ మోటార్ వెహికల్ మరియు ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
160 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి.
స్థానిక భాష అయిన తెలుగు చదవడం రాయడం వచ్చి ఉండాలి.