ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు మరియు భవనాల శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ విడుదల చేశారు.
అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ఈ నోటిఫికేషన్స్ ద్వారా మొత్తం మూడు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు. జిల్లాల వారీగా ఖాళీల సంఖ్య మరియు అప్లై తేదీలు మాత్రమే మారుతాయి. అన్ని జిల్లాల్లో కూడా ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, ఎంపిక విధానము వంటివి ఒకే విధంగా ఉన్నాయి.
పేద నిరుద్యోగులు కోసం అత్యుత్తమ ఫ్యాకల్టీ తో అతి తక్కువ ధరలో ఆన్లైన్ క్లాసెస్..
✅ APPSC గ్రూప్ 2 పూర్తి కోర్సు – 399/- మాత్రమే.
AP ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పూర్తి కోర్స్ – 499/-
మా యాప్ లో మీరు తీసుకునే కోర్స్ ల్లో సిలబస్ ప్రకారం క్లాసులతోపాటు PDF మెటీరియల్స్ మరియు ప్రాక్టీస్ టెస్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
భర్తీ చేస్తున్న పోస్టులు:
ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్లు), వాచ్ మెన్ , శానిటరీ వర్కర్ ( సఫాయి కర్మాచారి)
విద్యార్హతలు :
ఆఫీస్ సబార్డినేట్ మరియు వాచ్ మెన్ ఉద్యోగాలకు 10వ తరగతి అర్హత ఉండాలి. ఈ రెండు రకాల పోస్టులకు అనుభవం ఉంటే అదనంగా మార్కులు కలుపుతారు.
శానిటరీ వర్కర్ ఉద్యోగాలకు విద్యార్హత లేకపోయినా పని అనుభవం ఉంటే అప్లై చేసుకోవచ్చు.
వాచ్ మెన్ మరియు సానిటరీ వర్కర్ ఉద్యోగాలకు ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వయస్సు:
ఈ పోస్టులకు అప్లై చేయాలంటే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు మధ్య ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ , బీసీ , ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఐదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
దివ్యాంగులైన అభ్యర్థులకు పదేళ్ల వయో సడలింపు ఉంటుంది.
జీతము : అన్ని ఉద్యోగాలకు జీతము ఒకే విధంగా ఉంటుంది.
ఆఫీస్ సబార్డినేట్ – 15,000/-
వాచ్ మెన్ – 15,000/-
శానిటరీ వర్కర్ – 15,000/-
అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్
ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా విద్యార్హత ధ్రువపత్రాలు, 4వ తరగతి నుండి పదవ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రము, EWS అభ్యర్థులు అయితే EWS సర్టిఫికెట్, దివ్యాంగులైన అభ్యర్థులు అయితే సదరం సర్టిఫికెట్, అనుభవం ఉన్న వారు ఆయితే అనుభవ ధ్రువీకరణ పత్రాలు మరియు ఇతర సర్టిఫికెట్లు వంటి వాటిపై సెల్ఫ్ అటిస్టేషన్ చేసి అప్లికేషన్ కు జతపరిచి సంబంధిత కార్యాలయంలో అందజేయాలి.
ఎంపిక విధానం : మెరిట్ / ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
మీ జిల్లాలో ఇప్పటికే విడుదల చేసిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడానికి క్రింద ఇచ్చిన జిల్లాల వారీగా ఉన్న లింకులపై క్లిక్ చేసి మీ జిల్లాలో విడుదల చేసిన నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
➡ Alluri Sitharamaraju District
➡ Parvathipuram Manyam District