ఆంధ్రప్రదేశ్ లో మరో బంపర్ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాల్లో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయొచ్చు.
ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి.
ఈ నోటిఫికేషన్ డాక్టర్ వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుండి విడుదల చేశారు.
ఇటీవల ఏపీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 2 ఉద్యోగాల మాదిరిగానే ఈ ఉద్యోగాల ఎంపిక కూడా ఉంటుంది. అర్హత ,ఎంపిక విధానం, సిలబస్, జీతం అన్ని దాదాపు సమానంగా ఉంటాయి. ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహిస్తుంది.. కాబట్టి ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 2 ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు కూడా అప్లై చేసుకుంటే ఈ పోస్టులకు ప్రత్యేకంగా సన్నద్ధత అవ్వకుండా పోటీ పడవచ్చు.
అలాగే ఈ ఉద్యోగాలు ఎంపికలో ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.
ఇటీవల ఏపీపీఎస్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1, గ్రూప్ 2 , పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్లు , డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్, ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్ట్లు, డిగ్రీ కాలేజ్ లలో లెక్చరర్స్ , జూనియర్ కాలేజ్ లలో లెక్చరర్స్ వంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల చేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇంటర్మీడియేట్ కాలేజ్ లలో జూనియర్ లెక్చరర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ నోటిఫికేషన్స్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి
✅ గ్రూప్ 1 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
గ్రూప్ 2 నోటిఫికేషన్ పూర్తి వివరాలు
పాలిటెక్నిక్ లెక్చరర్స్ నోటిఫికేషన్ వివరాలు
డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నోటిఫికేషన్ వివరాలు
AP కాలుష్య నియంత్రణ మండలిలో ఉద్యోగాలు
డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషన్ వివరాలు
జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ వివరాలు
ప్రస్తుతం విడుదలైన నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థులు అందరూ అప్లై చేయవచ్చు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము .
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : డాక్టర్ వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్
పోస్టుల పేర్లు : జూనియర్ అసిస్టెంట్
మొత్తం పోస్టుల సంఖ్య : 20
ఎంపిక విధానం : ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు కంప్యూటర్ ప్రొఫెషియన్సీ టెస్ట్ ఆధారంగా ( కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు )
అప్లై విధానం : YSRUHC అధికారిక వెబ్సైట్ లో
అప్లికేషన్ ప్రారంభ తేదీ : 12-01-2024
అప్లికేషన్ చివరి తేదీ : 01-02-2024
పరీక్ష తేదీ : తర్వాత ప్రకటిస్తారు.
వయస్సు : 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు. మరియు PH అభ్యర్థులకు పదేళ్ల సడలింపు కలదు .
ఫీజు :
ఎస్సీ, ఎస్టీ, బీసీ ,ఎక్స్ సర్వీస్మెన్ మరియు విభిన్న ప్రతిభావంతులైన పరీక్షఅభ్యర్థులకు 750/-
మిగతా అభ్యర్థులకు 1500/-
పరీక్ష విధానం : ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్ష ముందుగా నిర్వహిస్తారు. ఈ పరీక్ష 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి 150 ప్రశ్నలు ఇస్తారు. ఇవి ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. 150 నిమిషాల సమయం ఉంటుంది.
ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి ప్రతి పేపర్లో 150 ప్రశ్నలు ,150 మార్కులకు, 150 నిమిషాల సమయం ఇస్తారు.
మెన్స్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులును షార్ట్ లిస్ట్ చేసి కంప్యూటర్ ప్రొసీషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు.