ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న గ్రామ సచివాలయ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు జరుగుతున్న వాలంటీర్ వ్యవస్థ మంచి ఫలితాలు ఇస్తున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ప్రస్తుతం భావిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత గ్రామస్థాయిలో ప్రతి 50 ఏళ్లకు ఒక వాలంటీర్ ను నియమించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రజలకు చేరవేయడం వాలంటీర్ల బాధ్యత. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్న వారికి గౌరవ వేతనం క్రింద ప్రభుత్వం ప్రతినెల 5000/- రూపాయలు ఇస్తుంది. AP లో వాలంటీర్లుగా ఎంపిక కావడానికి కనీస విద్యార్హత 10వ తరగతి గా నిర్ణయించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల గౌరవ వేతనం మరో 750 రూపాయలు పెంచి మొత్తం 5750/- రూపాయలు వాలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం ఇస్తుంది. ఆంధ్ర ప్రదేశ్ లో వాలంటీర్లను ఎటువంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేశారు.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 , బ్యాంక్, RRB, SSC మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . ఈ కోర్సుల్లో ఉన్న DEMO క్లాసెస్ చూసి నచ్చితేనే మీరు కోర్స్ తీసుకోవచ్చు.
గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఇలాంటి వ్యవస్థని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.
ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఒకసారి సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ వ్యవస్థ పై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఎన్నికలు ముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత త్వరగా గ్రామస్థాయిలో బూతు వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి గారు భావిస్తున్నారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు అందే విధంగా చూడడానికి ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. మొత్తం 34,694 వాలంటీర్లను నియమించే అవకాశం కనిపిస్తుంది.
బూతు వాలంటీర్ల పాత్ర , పనితీరు మరియు బూతు వాలంటీర్ల విధివిధానాలపై ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత ముఖ్యమంత్రి గారు అధికారులతో సమీక్ష జరిపిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ నియామకాలపై స్పష్టత వస్తుంది.
మరి తెలంగాణలో ఇలాంటి వ్యవస్థ అమల్లోకి వస్తే విద్యార్హత ఏమిటి ? ఎంత గౌరవ వేతనం ఇస్తారు అనేది తెలియాల్సి ఉంది.