గ్రామ సచివాలయం 3వ నోటిఫికేషన్ హాల్ టికెట్స్ విడుదల | AP Grama Sachivalayam 3rd Notification | AP Grama Sachivalayam AHA Hall tickets Download

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాలకు అనుబంధంగా ఉండే రైతు భరోసా కేంద్రాల్లో పశుసంవర్ధక అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ కోసం గత నెల 20వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. 

మొత్తం 1896 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా 19,323 మంది ఈ పోస్టులకు అప్లై చేసుకున్నారు. డిసెంబర్ 11వ తేదీ వరకు ఈ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించగా ఒక్కో పోస్టుకు దాదాపు పదిమంది పోటీపడుతున్నారు. 

అత్యధికంగా పోస్టులు ఉన్న అనంతపురం జిల్లాలో 473 పోస్టులకు 1,079 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అత్యల్పంగా పోస్టులు ఉన్న విజయనగరం జిల్లాలో 13 పోస్టులకు 1539 మంది దరఖాస్తు చేసుకున్నారు.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

జిల్లాల వారీగా భర్తీ చేస్తున్న పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇👇

శ్రీకాకుళం – 34

విజయనగరం – 13

విశాఖపట్నం – 28

తూర్పుగోదావరి – 15

పశ్చిమగోదావరి – 102

కృష్ణ – 120

గుంటూరు – 229

నెల్లూరు – 143

ప్రకాశం – 173

చిత్తూరు – 100

కడప – 210 

కర్నూలు – 252

అనంతపురం – 473

డిసెంబర్ 27 నుంచి ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్స్ ను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేయవచ్చు. అలాగే ఈ ఉద్యోగాలు ఎంపికలో భాగంగా నిర్వహించే పరీక్షను డిసెంబర్ 31వ తేదీన నిర్వహించబోతున్నట్లు నోటిఫికేషన్ లోనే తెలిపారు. ఈసారి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించబోతున్నారు. 

ఈ పరీక్షలో రెండు భాగాలు ఉంటాయి. పార్ట్ “ ఎ “ లో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ నుండి 50 మార్కులకు ప్రశ్నలకు ఇస్తారు.

పార్ట్ “ బి “ లో పశుసంవర్ధక సబ్జెక్టు నుండి 100 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. 

అంటే ఈ మొత్తం పరీక్ష 150 మార్కులకు గాను 150 ఆబ్జెక్టివ్ టైపు ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది . ప్రతి తప్పు సమాధానం కి  ⅓ వంతు మార్కులు తగ్గిస్తారు. 

ప్రభుత్వ సర్వీసులో పనిచేస్తున్న వారికి వెయిటేజీ మార్కులు కూడా కలుపుతామని నోటిఫికేషన్లోనే ముందుగా తెలియజేయడం జరిగింది. గోపాలమిత్ర,  గోపాలమిత్ర సూపర్వైజర్లు, 1962 వెట్స్ , ఔట్సోర్సింగ్ లేదా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న వారికి ప్రతి ఆరు నెలల సర్వీస్ కు ఒకటిన్నర మార్కులు చొప్పున గరిష్టంగా 15 మార్కులు వెయిటేజీ కేటాయిస్తారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా జిల్లాల వారీగా మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ రిజర్వేషన్ల దామాషా ప్రకారం ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేసి ఉద్యోగంలోకి తీసుకుంటారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!