ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాలకు ఉచితంగా శిక్షణ , స్టడీ మెటీరియల్ మరియు స్టైఫండ్ | APPSC Group 2 Free Coaching, Study Material | APPSC

ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే నిరుద్యోగులకు ఒక మంచి శుభవార్త. ఉచితంగా గ్రూప్ 2 ఉద్యోగాలకు కోచింగ్ ఇస్తున్నారు.

తిరుపతి మరియు కర్నూలు జిల్లాలో ఈ ఉచిత శిక్షణ ఇస్తున్నారు. 

తిరుపతి జిల్లాకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి 👇 👇👇

గ్రూప్ 2 నోటిఫికేషన్ ప్రిలిమినరీ పరీక్షకు ఉచితంగా పేద నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా అధికారి వి.భాస్కర్ రెడ్డి గారు తెలిపారు. 

ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ అభ్యర్థులు ఈనెల 22వ తేదీలోపు అప్లై చేసుకోవచ్చని చెప్పారు. ఈ ఉచిత శిక్షణ 27 నుంచి 50 రోజులు ఉంటుందని , ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్ మరియు స్టడీ మెటీరియల్ కూడా ఇస్తామని తెలిపారు. 

డిగ్రీలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుందని చెప్పారు. ఎంపికైన వారికి తిరుపతి ఎంఆర్ పల్లి బీసీ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 

దరఖాస్తులను తిరుపతిలోని బీసీ స్టడీ సర్కిల్ ఫర్ బీసీస్, డోర్ నెంబర్ 4-171-2లో అందజేయాలని కోరారు. పూర్తి వివరాలు కోసం 9441456039 , 9985022254 , 9346221553 నంబర్స్ కి సంప్రదించాలని చెప్పారు. 

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . పూర్తి కోర్స్ కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ క్లాసెస్ తో కోచింగ్ ఇస్తున్నాము . 

గ్రామ సచివాలయం , గ్రూప్ 2 , పోలీస్ ఉద్యోగాలు , గ్రామ సచివాలయం పశుసంవర్ధక సహాయకులు వంటి ఉద్యోగాల టెస్ట్ సిరీస్ లు కేవలం 99/- రూపాయలకే ఇస్తున్నాము.

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

కర్నూలు జిల్లాకు చెందిన వివరాలు ఇలా ఉన్నాయి.. 👇👇👇

కర్నూలు జిల్లాలో కూడా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అర్హులైన డిగ్రీ చదివిన పేద అభ్యర్థులకు ఉచితంగా గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షకు శిక్షణ ఇస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ సాధికారత అధికారిని లక్ష్మీ దేవమ్మ , ఏపీ బీసీ స్టడీ సర్కిల్ కర్నూలు డైరెక్టర్ వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఎస్సీ,  ఎస్టీ, మైనారిటీ నిరుద్యోగులు అర్హులని , దరఖాస్తులను ఏపీ బీసీ స్టడీ సర్కిల్, కల్లూరు , తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా , అబ్బాస్ నగర్, కర్నూలుకు ఈనెల 26వ తేదీలోగా స్వయంగా లేదా పోస్టు ద్వారా పంపించవచ్చని చెప్పారు.

45 రోజులు ఉచిత శిక్షణ ఉచిత శిక్షణ ఇస్తామని , శిక్షణకాలంలో ఉచితంగా స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుందని , శిక్షణ పూర్తయిన వారికి స్టయిఫండ్ కూడా మంజూరు చేస్తామని తెలిపారు. 

పూర్తి వివరాలు కోసం 08518236076 అని నెంబర్కు సంప్రదించాలని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!