గ్రామ సచివాలయం 3వ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Grama Sachivalayam 3rd Notification Released | AP Grama Sachivalayam Animal Husbandry Assistant Notification 2023

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలు భర్తీ కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఎప్పటి నుండో ఎదురుచూస్తూ ఉన్నారు. తాజాగా గ్రామ సచివాలయాల్లో 1896 ఉద్యోగాలు భర్తీ కోసం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల అయింది.

గ్రామ మరియు వార్డు సచివాలయంలో 19 రకాల ఉద్యోగాలు ఉంటాయి. ఈ 19 రకాల ఉద్యోగ ఖాళీలు కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 14 వేలకు పైగానే ఖాళీలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం ముందుగా గ్రామ సచివాలయాల్లో ఉండే పశుసంవర్ధక సహాయకుల ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1896 పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతుంది.

ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ ద్వారా ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీ జరుగుతుంది అని నోటిఫికేషన్లో స్పష్టం చేయడం జరిగింది.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఉన్నవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : పశుసంవర్ధక శాఖ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

✅ ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – పర్మినెంట్ ఉద్యోగాలు

🔥 పోస్టుల పేర్లు : పశుసంవర్ధక సహాయకులు

మొత్తం పోస్టులు : 1896

🔥 అర్హతలు : 1) శ్రీ నిర్వహించిన రెండు సంవత్సరాల పశు సంవర్ధక పాలిటెక్నిక్ కోర్సు

వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తిరుపతి, (లేదా)

2) డైరీయింగ్ మరియు పౌల్ట్రీ సైన్సెస్‌లో ఇంటర్మీడియట్ ఒకేషనల్ కోర్సు ఒకటి అధ్యయనం యొక్క విషయాలు / రెండు సంవత్సరాల పౌల్ట్రీ డిప్లొమా కోర్సు నిర్వహించింది శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ పాలిటెక్నిక్ కళాశాల రామచంద్రపురం

యూనివర్సిటీ, తిరుపతి మొదలైనవి, / పౌల్ట్రీ లో రెండేళ్ల ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు

GO MS No:34లోని నిబంధనల ప్రకారం పర్పస్ వెటర్నరీ అసిస్టెంట్ (MPVA). Dtd.13-09-2013 AHDDF (AHII) విభాగం. “క్లాజ్ (2)లోని అర్హతలతో ఎంపికైన అభ్యర్థులు

వెటర్నరీ అసిస్టెంట్ కోర్సులో ఒక సంవత్సరం డిపార్ట్‌మెంటల్ శిక్షణ పొందాలి పశుసంవర్థక శాఖ డైరెక్టర్ మరియు కలిగి ఉన్న వారిచే నిర్వహించబడుతుంది . ఈ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసి AHA పోస్ట్‌గా నియమించబడతారు”

🔥 అనుభవం :  అవసరం లేదు

✅ అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 20-11-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : పూర్తి నోటిఫికేషన్ లో తెలియజేస్తారు

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

✅ వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు , బీసీ ,EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది .

🔥 జీతం ఎంత ఉంటుంది : రెండు సంవత్సరాల ప్రొబిషనరీ కాలం ఉంటుంది. ఈ రెండు సంవత్సరాలు కాలంలో పదిహేను వేల రూపాయల జీతం ఇవ్వబడుతుంది. రెండు సంవత్సరాల ప్రోబేషన్ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు అప్పటి పే స్కేల్ ప్రకారం జీతం ప్రారంభమవుతుంది. 

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా

అప్లికేషన్ విధానం : ఆన్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి ఆన్లైన్ లో అప్లై చేయండి.

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం “ INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!