ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టు నుండి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా టైపిస్ట్ అనే ఉద్యోగాన్ని కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు నవంబర్ 18వ తేదీ లోపు ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి.
✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..
ఈ నోటిఫికేషన్ ద్వారా అమలాపురంలో ఉన్న స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో టైపిస్టు ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు.
ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఏపీ జ్యుడీషియల్ మినిస్ట్రీయల్ సర్వీసెస్ చెందిన రిటైర్డ్ ఉద్యోగులు మరియు మిగతా నిరుద్యోగ అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
అర్హులైన రిటైర్డ్ అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయకపోతే మిగతా వారిని అనగా నిరుద్యోగ అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ పోస్టులకు అప్లై చేయాలంటే నిరుద్యోగ అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసి , దానితోపాటు ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఎగ్జామినేషన్స్ నుండి ఇంగ్లీషులో హయ్యర్ నందు ఉత్తీర్ణత కలిగిన సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
ఈ పోస్ట్ కు ఎంపికైన వారికి 25,220/- జీతం ఉంటుంది
ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులకు వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి . అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ , ఎస్టీ , బిసి , ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు వయస్సులో ఐదేళ్ల సడలింపు కలదు.
ఈ పోస్టుకు అప్లై చేసే అభ్యర్థులు నవంబర్ 18 సాయంత్రం 5 గంటలకు రాజమహేంద్రవరంలో ఉన్న జిల్లా కోర్టులో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి.
🔥 Download Notification & Application