ఆంధ్రప్రదేశ్ లో 243 సిడిపిఓ ఉద్యోగాలు కి అనుమతి | AP CDPO Jobs Recruitment 2023 | APPSC CDPO Notification 2023

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 243 సిడిపిఓ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలంటూ తాజాగా జీవో విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలోని 61 సిడిపిఓ పోస్టులు , 161 ఈవో గ్రేడ్-1 సూపర్వైజర్ పోస్ట్లు , 21 సూపరిండెంట్ ఆఫ్ చిల్డ్రన్ హోమ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో Ms.No 40 పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది .

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

📌 Join Our What’s App Channel 

గతంలో ఈ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేది. అయితే ఈసారి ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది. తాజాగా విడుదల చేసిన జీవో లో ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా ఈ పోస్టులు భర్తీ చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ జీవోలో మహిళా , శిశు సంక్షేమ శాఖకు చెందిన కమిషనర్ త్వరగా ఈ పోస్టులకు సంబంధించిన ఖాళీల వివరాలు , రోస్టర్ పాయింట్లు  అర్హతలు వంటి వాటికి సంబంధించిన సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు కు అందజేయాలని పేర్కొన్నారు. 

కాబట్టి అతి త్వరలోనే ఆంధ్రప్రదేశ్ లో ఈ రెండు రోజులు సిడిపిఓ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!