ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ | ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు | APPSC Latest News today | AP Latest News today

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది.

ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్ష నియామకాల కోసం విడుదల చేసే ఉద్యోగాల నోటిఫికేషన్ లలో అభ్యర్థుల వయోపరిమితిని పెంచుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వులు ప్రకారం వయసు మీరిన నిరుద్యోగులకు మేలు చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

🔥 మరికొన్ని ఉద్యోగాల సమాచారం మీ వాట్సాప్ లో చూడాలంటే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here

ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్, ఇతర రిక్రూట్మెంట్ ఏజెన్సీలు నేరుగా భర్తీ చేసే నాన్ యూనిఫాం పోస్టులు, యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. 

నాన్ యూనిఫాం పోస్టులకు అభ్యర్థుల వయో పరిమితిని 34 నుంచి 42 సంవత్సరాలకు పెంచింది. 

యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయో పరిమితికి అదనంగా రెండు సంవత్సరాలను పెంచింది. 

ఈ వయోపరిమితి పెంపుదల వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వర్తిస్తుంది. 

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!