ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి లో ఉన్న ఎయిమ్స్ నుండి వివిధ గ్రూప్ బి గ్రూప్ సి నాన్ ఫ్యాక్టరీ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది .
ఈ ఉద్యోగాలను డైరెక్ట్ బేసిస్ విధానంలో భారతి చేస్తున్నారు.
ఈ పోస్టులకు భారతీయ పౌరులు అందరూ అప్లై చేయవచ్చు .
ఈ నోటిఫికేషన్ ద్వారా సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ , PA, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ , మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ గ్రేడ్-1 , అసిస్టెంట్ , పర్సనల్ అసిస్టెంట్ , లైబ్రేరియన్ గ్రేడ్-3 , ల్యాబ్ టెక్నీషియన్ అప్పర్ డివిజన్ క్లర్క్ , ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2 పోస్టులను భర్తీ చేస్తున్నారు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకుని అప్లై చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్ ప్రింట్ ను తీసుకొని స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి .
ఈ పోస్టులకు ఆగస్టు 5 నుంచి అప్లై చేయవచ్చు.
ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 30 రోజుల్లోపు ఆన్లైన్లో అప్లై చేయాలి .
ఆన్లైన్ లో అప్లై చేయడానికి చివరి తేదీ నుంచి పది రోజుల్లోపు ఆఫ్లైన్ లో అప్లికేషన్ ప్రింట్ ను పంపించాలి .
విజయవాడ , చెన్నై , ముంబై , న్యూఢిల్లీ , కోల్ కత్తా జైపూర్ , లక్నో , పాట్నా , భోపాల్ , తిరువనంతపురం , బెంగళూరు, గౌహతి , హైదరాబాద్ , అహ్మదాబాద్ , రాయపూర్ లో పరీక్ష కేంద్రాలు ఉంటాయి.
UR , OBC , EWS అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు మరియు ప్రాసెసింగ్ ఫీజు కలిపి 1000/- రూపాయలు చెల్లించాలి .
SC , ST, PwBD , Female , ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు కు ఫీజు లేదు . కానీ ప్రొసీసింగ్ ఫీజు వంద రూపాయలు చెల్లించాలి .
పూర్తి నోటిఫికేషన్ మరియు Apply లింక్ క్రింద ఇవ్వబడినవి .
అర్హత ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ చదివి ఆన్లైన్లో అప్లై చేయండి.