ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నుండి తాజాగా ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల అయింది .
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో అప్రెంటిస్ షిప్ కొరకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు . తొమ్మిది జిల్లాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు .
వివిధ ట్రేడ్లలో ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ అప్రెంటిస్ కు అప్లై చేయవచ్చు .
ఇందుకోసం అర్హులైన అభ్యర్థులు వెబ్సైట్లో ఆగస్టు ఒకటి నుండి ఆగస్టు 15వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలి .
తూర్పుగోదావరి , కోనసీమ , కాకినాడ , విశాఖపట్నం , అనకాపల్లి , అల్లూరి , సీతారామరాజు , విజయనగరం , మన్యం పార్వతీపురం , శ్రీకాకుళం జిల్లాల వారీగా వివిధ ట్రేడ్లలో ఉన్న ఖాళీగా ఉన్న అప్రెంటిస్ షిప్ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు .
ఈ అప్రెంటిస్ షిప్ కు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు లేదా రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని దిగు తెలిపిన తేదీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు హాజరు కావాలి .
తూర్పుగోదావరి , కాకినాడ , కోనసీమ జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఆగస్టు 18వ తేదీన వెరిఫికేషన్ కు హాజరు కావాలి .
విశాఖపట్నం , అనకాపల్లి , అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఆగస్టు 19వ తేదీన వెరిఫికేషన్ కు హాజరు కావాలి .
శ్రీకాకుళం , మన్యం , పార్వతీపురం , విజయనగరం జిల్లాలకు చెందిన అభ్యర్థులు ఆగస్టు 20వ తేదీన వెరిఫికేషన్ కు హాజరు కావాలి .
ఒక జిల్లాలో సంబంధిత ట్రేడ్ నందు ఖాళీలు లేనియెడల వేరే జిల్లాలో పనిచేయుటకు అంగీకార పత్రమును సర్టిఫికెట్ వెరిఫికేషన్ టైం నందు ఇవ్వాలి .
అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో 118/- , రూపాయల అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి .
అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ తీసుకురావాల్సిన సర్టిఫికెట్స్ 👇👇👇
- రిజిస్ట్రేషన్ ఫారం
- ఎస్ ఎస్ సి మార్కుల లిస్టు
- ఐటిఐ మార్కుల లిస్టు
- కుల ధ్రువీకరణ పత్రము ( SC , ST , BC అభ్యర్థులకు మాత్రమే )
- NCC లేదా స్పోర్ట్స్ సర్టిఫికెట్
- ఆధార్ కార్డు
- PHC సర్టిఫికెట్
- బయోడేటా ఫామ్
- ఎక్స్ సర్వీస్ మెన్ ధ్రువపత్రము
- సొంత అడ్రస్ గల 25/- రూపాయల స్టాంపు అంటించిన కవరు
సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగు ప్రదేశం : జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్ , వి.టి అగ్రహారం , విజయనగరం .
ఇదివరకే సెలెక్ట్ కాబడి అప్రెంటిస్ట్ పూర్తి చేసిన వారు మళ్లీ అప్లై చేయరాదు .
నోటిఫికేషన్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్న అభ్యర్థులు 08922 294906 అని నెంబర్ కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు .
✅ పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి