సొంత జిల్లాలో ఉద్యోగం | AP Staff Nurse Recruitment | AP Staff Nurse Jobs Recruitment | AP Medical Health Department Jobs

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి విడుదల చేశారు . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేయాలి . ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్నారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 97 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు . ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు భర్తీ కోసం విడుదల చేసిన పెద్ద నోటిఫికేషన్ గా దీన్ని చెప్పవచ్చు . 

ఈ పోస్టులకు జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది .

ఈ నోటిఫికేషన్లు కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ కోసం విడుదల చేయడం జరిగింది . ప్రస్తుతం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆఫ్లైన్లో దరఖాస్తులు కోరుతున్నారు .

ఈ పోస్టులన్నింటినీ కాంట్రాక్టు పద్ధతిపై నియామకం చేపడుతున్నారు .

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు జూన్ 30వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు లోపు అప్లై చేయాలి .

నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థుల యొక్క మెరిట్ లిస్ట్ జూన్ 30 2024 వాలిడ్ గా ఉంటుంది . 

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి . అంతేకాకుండా పూర్తి నోటిఫికేషన్ మరియు అధికారిక వెబ్సైట్ లింక్స్ కూడా క్రింద ఉన్నవి .

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ 

🔥 పోస్టుల పేర్లు : స్టాఫ్ నర్స్

మొత్తం పోస్టులు : 97 ( ఖాళీల బట్టి పోస్టుల పెరిగే లేదా తగ్గే అవకాశం కూడా ఉంటుంది )

🔥 అర్హతలు : GNM / బిఎస్సి నర్సింగ్ లేదా ఎంఎస్సీ నర్సింగ్ చేసి ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ మరియు మిడ్ వైవ్స్ కౌన్సిల్ లో పర్మినెంట్ రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి .

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 20-06-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 30-06-2023

కనీస వయస్సు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

Note : జూలై 1 2023 నాటికి 42 సంవత్సరాలు దాటకూడదు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు , బీసీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది . మరియు దివ్యాంగులైన అభ్యర్థులకు 10 సంవత్సరాల వయసడలింపు ఉంటుంది .

🔥 జీతం ఎంత ఉంటుంది : జీతం కి సంబంధించిన వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : పరీక్ష లేదు , కానీ ఈ ఉద్యోగానికి అప్లై చేయడానికి అవసరమైన కనీస విద్యార్హతలు వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది .

✓ అది ఎలా అంటే GNM లేదా బిఎస్సి నర్సింగ్ లేదా ఎమ్మెస్సీ నర్సింగ్ లో వచ్చిన మార్కుల నుండి 75% మార్కులు తీసుకుంటారు .

✓ పోస్ట్ కు అప్లై చేయడానికి అవసరమైన విద్యార్హత పూర్తి చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలకు ప్రతి సంవత్సరానికి ఒక మార్కు చొప్పున గరిష్టంగా 10 మార్కులు కలుపుతారు.

✓ మరో 15% మార్కులు గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ లేదా కోవిడ్ సమయంలో పనిచేసే ఉన్నారో వారు పని చేసిన కాలానికి మార్కులు కేటాయింపు క్రింది విధంగా ఉంటుంది .

✓ గిరిజన ప్రాంతాల్లో పని చేస్తే ప్రతి ఆరు నెలలకి 2.5 మార్కులు చొప్పున కలుపుతారు.

✓ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తే ప్రతి ఆరు నెలలకి రెండు మార్కులు చొప్పున కలుపుతారు.

✓ పట్టణ ప్రాంతాల్లో పనిచేస్తే ప్రతి ఆరు నెలలకి 1 మార్కు చొప్పున కలుపుతారు . 

🔥 అప్లికేషన్ పంపవలసిన చిరునామా : అధికారిక వెబ్సైట్ నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని , అప్లికేషన్ నుండి అవసరమైన ధ్రువపత్రములు జతపరిచి అభ్యర్థులు తమ అప్లికేషన్ ను దిగువ ఇవ్వబడిన అడ్రస్లు సబ్మిట్ చేయాలి .

సూపరింటెండెంట్ వారి కార్యాలయం , గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ , కాకినాడ జిల్లా వద్ద అప్లికేషన్ అభ్యర్థులు సబ్మిట్ చేయాలి . అప్లికేషన్ సబ్మిట్ చేసిన అభ్యర్థులు అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఇచ్చిన Acknowledgement ను భద్రపరుచుకోవాలి. 

🔥 ఫీజు : OC , BC అభ్యర్థులు 400 రూపాయలు , SC , ST, EWS , PWD , ఎక్స్ సర్వీస్ మైనర్ బదులు 200 రూపాయలు ఫీజు చెల్లించాలి .

అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లికేషన్ నింపి అప్లై చేయాలి . అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి పూర్తి వివరాలు చూసి అప్లై చేయండి.

గమనిక : ఈ నోటిఫికేషన్ రద్దు చేసే అధికారము చైర్మన్ , జిల్లా ఎంపిక కమిటీ కు అధికారం కాదు . గడువు తరువాత వచ్చిన దరఖాస్తులు మరియు అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులు పరిశీలించబడవు .

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

🔥 YouTube Channel – Click here

🔥 Telegram Group – Click here

🔥 Our APP – Click here 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!