సొంత గ్రామంలో ఉద్యోగము | అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో నోటిఫికేషన్ విడుదలైంది . ఈ నోటిఫికేషన్ ద్వారా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖకు చెందిన ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్త , మినీ అంగన్వాడీ కార్యకర్త , అంగన్వాడి సహాయకుల ఉద్యోగాలను భర్తీ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . 

నోటిఫికేషన్ విడుదల చేసిన రోజు నుండి ఏడు రోజుల్లోగా ఈ పోస్టులకు అప్లై చేయాలని నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది .

గతంలో ముఖ్యమంత్రి గారు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖపై సమీక్ష జరిపిన సందర్భంగా ఈ శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్లు జిల్లాల వారీగా ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మరో జిల్లాలో ఈ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల భర్తీ కోసం అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు . ప్రస్తుతం ఈ నోటిఫికేషన్ శ్రీకాకుళం జిల్లాలోని ఐసిడిఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి విడుదల చేయడం జరిగింది .

తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ మే 25 , 2023 .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ , శ్రీకాకుళం జిల్లా

🔥 మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 123

🔥 అర్హతలు : 10వ తరగతి

🔥 అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 18-05-2023

🔥 అప్లై చేయడానికి చివరి తేదీ : 25-05-2023

🔥 కనీస వయస్సు : 21 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు

🔥 గమనిక : ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతములలో 21 సంవత్సరాలు కలిగిన అభ్యర్థి లేకపోయినట్లయితే 18 సంవత్సరాలు నిండిన వారిని కూడా తీసుకోవడం జరుగుతుంది .

🔥 ముఖ్యమైన విషయాలు : 

✅ అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకుల /మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకమునకు కావలసిన అర్హతలు.

> పైన వుదహరించిన పోస్టుల భర్తీ విషయములో భర్తీ చేయుటకు గాని, నిలుపుటకు గాని, రద్దు పరుచుటకు గాని నియామకపు కమిటీ ఛైర్మన్ వారికి పూర్తి అధికారము కలదని తెలియజేయడమైనది.

> అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకుల / మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకమునకు స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత మహిళా అభ్యుర్ధుల నుండి సదరు పోస్టుల ఎంపిక కొరకు ధరఖాస్తులను ఆహ్వానించడమైనది.

> 21-35 సంవత్సరముల మధ్య వయస్సు గల వారై వుండవలెను (01.07.2022 నాటికి)

> అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకమునకు అభ్యర్థినులు తప్పనిసరిగా వివాహిత మహిళ లై మరియు వారి కుటుంబము సంబధిత గ్రామమునకు చెందిన వారి ఉండవలెను. 

తదుపరి అభ్యర్థినులు సంబంధిత గ్రామ సమ్మతి కలిగినవారై ఉండవలెను.

> అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు అభ్యుర్థులు 10 వ తరగతి ఉత్తీర్ణులై వుండవలెను. స్కూల్ సర్టిఫికేట్

ఆధారంగా నియామకం జరుగును. విద్యార్హత సర్టిఫికేట్ బట్టి మాత్రమే విద్యార్హత, వయస్సు పరిగణించబడును.

> అంగన్వాడీ సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణులై వుండవలెను. 

> SC హేబిటేషన్ కు కేటాయించిన పోస్టులలో SC అభ్యుర్ధులచే మాత్రమే భర్తీ చేయబడును.

> ST హేబిటేషన్ కు కేటాయించిన పోస్తులలో ST అభ్యుర్ధుల చే మాత్రమే భర్తీ చేయబడును.

> అంగన్వాడి కార్యకర్తలు/సహాయకుల ఎంపికలో గ్రామము స్థానికతకు ప్రాతిపదికగాను, మున్సిపాలిటీ పరిధిలో వార్డును స్థానికతకు ప్రాతిపదికగా పరిగణించ బడును.

> అభ్యర్ధులు ధరఖాస్తులను సంభంధిత ప్రాజెక్టు కార్యాలయమునందు అనగా సంబంధిత

ఐ.సి.డి.ఎస్.కార్యాలయములో పొంది పూర్తి చేసిన తదుపరి ధరఖాస్తులను అక్కడ అందజేసి రశీదును

పొందవలసినదిగా తెలియ జేయడమైనది.

> అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తలు పోస్టులు స్థానికమైనవి. వీటికి బదిలీ నిబంధనలు వర్తించవు.

> అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల నియమకము పొందుటకు

నిబంధనలతో పాటు సెలక్షన్ కమిటీ తుది నిర్ణయము ప్రకారము ఎంపికలు నిర్వహించబడును.

> కేంద్రము పోస్టు (అంగన్వాడీ కార్యకర్తలు/సహాయకులు/మినీ అంగన్వాడీ కార్యకర్తల) రోస్టరు ప్రకారము ఏకేటగిరికీ వర్తించునో భర్తీ ప్రక్రియలో ఆ కేటగిరీ వారిచే భర్తీ చేయబడును.

> ఎస్.సి/ఎస్.టి. కేంద్రములకు మరియు ఎస్.సి/ఎస్.టి.కేటగిరికి రోస్టరు లో రిజిస్టరు కాబడిన ఎస్.సి/ఎస్.టి. పోస్టులకు 21 సంవత్సరములు నిండిన అభ్యుర్ధులు లేని ఎడల 18 సంవత్సరములు నిండిన వారు కూడా నియమించబడ వచ్చును.

>జి.ఓ.ఏం.ఎస్.నెం.20,తే30.05.2015దీఅనుసరించి,నియమించబడిన అంగన్వాడీకార్యకర్తలు/సహాయకులు/ మినీ అంగన్వాడీ కార్యకర్తలు 60 సంవత్సరములు నిండిన పిదప విధుల నుండి విరమించవలసి యుండును.. 

🔥 జీతం ఎంత ఉంటుంది : 

అంగన్వాడి కార్యకర్తకు – 11,500 రూపాయలు

మినీ అంగన్వాడి కార్యకర్తకు – 7,000/- 

అంగన్వాడి సహాయకులకు – 7,000/-

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : ఇంటర్వూ మరియు మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు .

🔥 పరీక్ష విధానం : పరీక్ష లేదు , ఇంటర్వ్యు నిర్వహిస్తారు .

🔥 ఫీజు : లేదు 

🔥 అప్లికేషన్ విధానం : ఆఫ్లైన్ లో అప్లై చేయాలి 

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి నోటిఫికేషన్ లో ఉన్న అప్లికేషన్ నింపి సంబంధిత కార్యలయం లో అప్లై చేయండి. 

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

▶️ అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 👍

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!