రైల్వే లో పరీక్ష లేకుండా ఉద్యోగం | RRC Latest Recruitment | Railway Latest Notification

నిరుద్యోగ అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది . రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుండి టెక్నికల్ అసోసియేట్ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్లైన్లో కోరుతున్నారు .

నోటిఫికేషన్ కి సంబంధించిన పూర్తి వివరాలు మరియు నోటిఫికేషన్ అధికారిక వెబ్సైట్ లింక్స్ క్రింద ఇవ్వబడినవి .

ఈ నోటిఫికేషన్ నార్త్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ , ప్రయాగ్ రాజ్ నుండి విడుదలైంది . ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో అదికూడా తాత్కాలిక పద్ధతిన భర్తీ చేస్తున్నట్లుగా నోటిఫికేషన్ లో స్పష్టంగా పేర్కొన్నారు . నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది , అప్లై చేయడానికి చివరి తేదీ మే 12 ,2023 .

నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : నార్త్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ , ప్రయాగ్ రాజ్ 

మొత్తం ఉద్యోగాలు సంఖ్య : 15

ఉద్యోగం పేరు : జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ( సివిల్ )

ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) – కాంట్రాక్ట్ బేసిస్ విధానంలో భర్తీ చేస్తున్న తాత్కాలిక ఉద్యోగాలు

అర్హతలు : మూడు సంవత్సరాల సివిల్ ఇంజనీరింగ్ లో డిప్లమో లేదా బీఎస్సీ డిగ్రీ లేదా నాలుగు సంవత్సరాల బీటెక్ లో సివిల్ ఇంజనీరింగ్

అప్లై చేయడానికి ప్రారంభ తేదీ : 28-04-2023

అప్లై చేయడానికి చివరి తేదీ : 12-05-2023

కనీస వయస్సు : 18 సంవత్సరాలు 

గరిష్ట వయస్సు : 33 సంవత్సరాలు 

వయస్సు సడలింపు : ప్రభుత్వ నిబంధనలో ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాలు మరియు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాల వయసు సడలింపు కలదు . 

నోట్: అన్ రిజర్వ్డ్ క్యాటగిరి లో ఉన్న ఉద్యోగాలకు ఈ వయో సడలింపు వర్తించదు .

జీతం ఎంత ఉంటుంది

  1. Z క్లాస్ సిటీలో పోస్టింగ్ ఇస్తే 25,000/- జీతం ఉంటుంది
  1. Y క్లాస్ సిటీలో పోస్టింగ్ ఇస్తే 27,000/- జీతం ఉంటుంది
  1. X క్లాస్ సిటీలో పోస్టింగ్ ఇస్తే 30,000/- జీతం ఉంటుంది

ఎంపిక విధానం ఎలా ఉంటుంది : 

అభ్యర్థుల ఎంపికలో  క్రింది విషయాలను పరిగణలోకి తీసుకుంటారు 

  1. GATE లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ( 2016 నుండి 2022 వరకు )
  2. బీటెక్ అభ్యర్థులు
  3. డిప్లమా అభ్యర్థులు

పరీక్ష విధానం : పరీక్ష లేదు , ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఉద్యోగానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 

ఫీజు : 100/-

Note : ఎస్సీ , ఎస్టీ , మహిళలు మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు లేదు

అప్లికేషన్ విధానం : ఆన్లైన్లో అప్లై చేయాలి .

ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోని పూర్తి నోటిఫికేషన్ చదివి అధికారిక వెబ్సైట్ లింక్ కూడా క్రింద ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ వెబ్సైట్ లో అప్లై చేయండి.

నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి : ఇక్కడ క్లిక్ చేయండి 

అధికారిక వెబ్సైట్ : ఇక్కడ క్లిక్ చేయండి 

🔥 అభ్యర్థులకు ముఖ్య గమనిక : ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి అప్లై చేయండి . All the best 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!