న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ తోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు .
ఈ నోటిఫికేషన్ ను నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ -4 అని పిలవడం జరుగుతుంది .
✅ మొత్తం పోస్టులు : 3,055
▶️ దేశవ్యాప్తంగా ఉన్న 18 ఎయిమ్స్ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు . ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ లో 117 ఖాళీలు మరియు తెలంగాణ రాష్ట్రంలోని బీబీనగర్ లో ఉన్న ఎయిమ్స్ లో 150 ఖాళీలు ఉన్నాయి.
✅ అర్హత : జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ కోర్సుతోపాటు రెండేళ్ల పని అనుభవం లేదా బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసి స్టేట్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ లో తప్పనిసరిగా నర్సులుగా రిజిస్టర్ అయి ఉండాలి .
✅ వయస్సు : 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
✅ వయో సడలింపు : ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు , ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు , దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు , ఎక్స్ సర్వీస్మెన్ కు ఐదేళ్ల సడలింపు ఉంటుంది .
✅ జీతం : అన్ని రకాల అలవెన్సులు కలుపుకొని ప్రారంభ వేతనం సుమారు 80,000/- వరకు వస్తుంది.
ఎంపిక విధానం : నార్ సెట్ -4 లో వచ్చిన మార్కులు , సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు .
✅ పరీక్ష విధానం : పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది .పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో 200 ప్రశ్నలు 200 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది . సబ్జెక్టుకు సంబంధించి 180 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ మరియు ఆటిట్యూడ్ కి సంబంధించి 20 ప్రశ్నలు అడుగుతారు . ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు , ప్రతీ తప్పు సమాధానానికి 1/3 మార్కులు ఋణాత్మక విధానం ఉంటుంది .
✅ ఎలా ప్రిపేర్ అవ్వాలి : ఈ పరీక్షలు బీఎస్సీ నర్సింగ్ నాలుగేళ్ల సిలబస్ నుంచి ప్రశ్నలు వస్తాయి , కాబట్టి బిఎస్సి నర్సింగ్ పుస్తకాలు చదివితే ఎక్కువ మార్కులు పొందవచ్చు . అలాగే గతంలో అడిగిన ప్రశ్నలు మరియు ఎమ్మెల్సీ నర్సింగ్ ప్రవేశ పరీక్ష ప్రశ్నలు సాధన చేస్తే మంచి మార్కులు పొందే అవకాశం ఉంది .
✅ అర్హత మార్కులు : జనరల్ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 50 శాతం ఓబిసి అభ్యర్థులకు 45 శాతం ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు రావాలి దివ్యాంగులైతే వారి క్యాటగిరి ని అనుసరించి ఐదు శాతం మార్కుల్లో సడలింపు ఉంటుంది
✅ అప్లై విధానం : ఈ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయవచ్చు .
✅ అప్లై చేయడానికి చివరి తేదీ : 05-05-2023
✅ పరీక్షా తేదీ : 03-06-2023
▶️ పూర్తి నోటిఫికేషన్ మరియు ఆన్లైన్ అప్లికేషన్ కోసం క్రింద ఉన్న లింక్స్ పై క్లిక్ చేయండి .
అధికారిక వెబ్సైట్ : Click here
పూర్తి నోటిఫికేషన్ : Click here
One thought on “AIIMS Nursing Officer Recruitment 2023 | NORCET 4 Syllabus”