NIT Warangal Jobs Recruitment 2026 : మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో వరంగల్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పర్మినెంట్ విధానంలో సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ ఉద్యోగాల నోటిఫికేషన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. అని వివరాలు తెలుసుకొని ఈ పోస్టులకు అర్హత ఉంటే అప్లై చేయండి.
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ :
- ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్ నుండి విడుదల అయ్యింది.
భర్తీ చేస్తున్న ఉద్యోగాలు :
- సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ అనే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.

అర్హతలు :
- పోస్టులను అనుసరించి టెన్త్+ఐటిఐ, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, బీటెక్, బిఈ, ME / M.tech వంటి అర్హతలు ఉన్న వారు అర్హులు.
వయస్సు వివరాలు :
- సూపరింటెండెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు లోపు ఉండాలి.
- సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ ఉద్యోగాలకు గరిష్ట వయస్సు 33 సంవత్సరాలు లోపు ఉండాలి.
- జూనియర్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు లోపు ఉండాలి.
అప్లికేషన్ తేదీలు :
- అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు జనవరి 9వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీలోపు అప్లై చేయాలి.
అప్లికేషన్ విధానం :
- అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో https://nitw.ac.in/staffrecruit వెబ్సైట్ లో అప్లై చేయాలి.
అప్లికేషన్ ఫీజు వివరాలు :
- UR / OBC / EWS అభ్యర్థులు 1500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు మరియు GST చెల్లించాలి.
- SC / ST/ PwBD / Women అభ్యర్థులు 1000/- రూపాయలు అప్లికేషన్ ఫీజు మరియు GST చెల్లించాలి.
ఎంపిక విధానం :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష , డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు :
- అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏమిటంటే, మొదటి దశ ఎంపిక ప్రక్రియ అంటే CBT హైదరాబాద్, ముంబై, ఢిల్లీ మరియు కోల్ కత్తా కేంద్రాలలో నిర్వహించబడుతుంది..
అభ్యర్థులకు ముఖ్యమైన గమనిక :
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా క్రింది ఇచ్చిన లింక్స్ ఉపయోగించి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదివిన తరువాత అప్లై చేయండి.
▶️ Download Full Notification – Click here
