10th, ఇంటర్, డిగ్రీ , బి.టెక్ అర్హతలు ఉన్నవారికి 2402 పోస్టులతో SSC నుండి భారీ నోటిఫికేషన్ విడుదల | SSC Phase XIII 2025 | SSC Phase 13 Notification 2025

SSC Phase 13 Notification 2025 full details and Apply Process
Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

భారతదేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసే ప్రధాన కమిషన్ అయిన స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) నుండి భారీ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 366 కేటగిరీల్లో 2402 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

SSC Phase 13 Notification 2025 Full Details :

SSC Phase XIII గా పిలవబడే ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు.

🔥 SSC Phase 13 Notification 2025 విడుదల చేసిన సంస్థ :

  • స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

🔥 SSC Phase 13 Notification 2025 ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలు :

  • ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోయే ఉద్యోగాలను సెలెక్షన్ పోస్ట్లు గా పేర్కొంటారు.
  • మొత్తం 366 విభాగాలలో 2402 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

🔥 విద్యార్హత :

  • ఈ నోటిఫికేషన్ లో భాగంగా వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
  • 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హత తో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔥 వయోపరిమితి :

  • ఈ ఉద్యోగాలకు సంబంధించి పోస్టులను అనుసరించి వయసు అవసరమగును.
  • 18 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల లోపు వయస్సు కలవారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కలదు.
  • ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు , ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు , దివ్యాంగులకు 10 సంవత్సరాలు , ఎక్స్ సర్వీస్ మెన్ కు 5 సంవత్సరాలు వయో సడలింపు కలదు.

🔥దరఖాస్తు విధానం:

ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్లో తేదీ 23/06/2025 లోగా దరఖాస్తు చేసుకోవాలి.

🔥దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా వంద రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
  • మహిళా అభ్యర్థులకు , ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులకు , దివ్యాంగులకు ఎక్స్ సర్వీస్మెన్ వారికి దరఖాస్తు ఫీజు నుండి మినహాయింపు కలదు.
  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించేందుకుగాను 24/06/2025 (రాత్రి 11:00 గంటల వరకు) చివరి తేదీగా నిర్ణయించారు.

🔥ఎంపిక విధానం :

  • ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
  • ఈ వ్రాత పరీక్ష ను జూలై 24 , 2025 నుండి ఆగస్టు 04 , 2025 లోగా నిర్వహించే విధంగా షెడ్యూల్ చేశారు.

🔥పరీక్షా విధానం:

  • మొత్తం 200 మార్కులు గాను నిర్వహించే ఈ రాత పరీక్షకు 60 నిమిషాల సమయం కేటాయిస్తారు.
  • జనరల్ ఇంటెలిజెన్స్ , జనరల్ ఎవేర్నెస్ , క్వాంటిటీటివ్ ఆప్టిట్యూడ్ , ఇంగ్లీష్ లాంగ్వేజ్ విభాగాల నుండి ఒక్కో విభాగం నుండి 25 ప్రశ్నలు చొప్పున 100 ప్రశ్నలు ఉంటాయి.
  • ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. 1/4 వంతు నెగిటివ్ మార్కింగ్ విధానం కలదు.

🔥ముఖ్యమైన తేదీలు:

  • ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ : 23/06/2025
  • ఆన్లైన్ విధానం ద్వారా ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : 24/06/2025 ( రాత్రి 11:00 గంటల లోగా)
  • కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష నిర్వహణ తేదీలు : 24/07/2025 నుండి 04/08/2025 వరకు.

👉 Click here for official website

👉 Click here to download notification

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *