మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ, గవర్నమెంట్, ఆఫ్ ఇండియాకు చెందిన స్పైసెస్ బోర్డు నుండి స్పైస్ రీసెర్చ్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ మెయిల్ చేసి అప్లై చేయాలి మరియు ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
- నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన వివరాలను ఈ ఆర్టికల్ చివరి వరకు చదివి తెలుసుకొని మీకు అర్హత ఉంటే త్వరగా తప్పనిసరిగా అప్లై చేయండి. ఎంపిక అయితే మీరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయవచ్చు.
✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
- స్పైసెస్ బోర్డు నుండి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు.
🔥 భర్తీ చేస్తున్న పోస్టులు :
- స్పైసెస్ బోర్డు లో అగ్రోనమీ / సాయిల్ సైన్స్ విభాగం మరియు ప్లాంట్ పాథాలజీ / ఎంటమాలజీ విభాగాల్లో స్పైస్ రీసెర్చ్ ట్రైనీ (SRT) అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 మొత్తం ఖాళీల సంఖ్య :
- ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 03 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
🔥 విద్యార్హత :
- అగ్రోనమీ / సాయిల్ సైన్స్ విభాగం లో స్పైస్ రీసెర్చ్ ట్రైన్ ఉద్యోగాలకు క్రింది విధంగా విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.
- అగ్రోనమీ / సాయిల్ సైన్స్ లో MSc
- కెమిస్ట్రీ / బయోకెమిస్ట్రీలో MSc
- MSc హార్టికల్చర్ – స్పైసెస్ ప్లాంటేషన్ మరియు స్పైసెస్
- ప్లాంట్ పాథాలజీ / ఎంటమాలజీ విభాగాల్లో స్పైస్ రీసెర్చ్ ట్రైనీ (SRT) ఉద్యోగాలకు క్రింది విద్యార్హతలు ఉన్నవారు అర్హులు.
- వ్యవసాయం / హార్టికల్చర్ -ప్లాంట్‌లో MSc
- పాథాలజీ/ఎంటమాలజీ లో MSc
- వృక్షశాస్త్రం / మైక్రోబయాలజీ / జువాలజీ / బయోకెమిస్ట్రీ / పాథాలజీ / నెమటాలజీ / ఏపికల్చర్ లో MSc
🏹 మన రాష్ట్రంలో పోస్టింగ్ వచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు – Click here
🔥 జీతం :
- నెలకు 21,000/- జీతము ఇస్తారు.
🔥 వయస్సు :
- 30 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
🔥 ఎంపిక విధానం :
- వాక్ ఇన్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఎంపిక చేస్తారు.
🔥 అప్లికేషన్ ఫీజు :
- ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి మరియు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరవ్వడానికి ఎటువంటి ఫీజు లేదు.
🔥 అప్లై విధానము :
- ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్నవారు ముందుగా మెయిల్ ద్వారా తమ అప్లికేషన్ పంపించాలి. తర్వాత ఇంటర్వ్యూ కు హాజరు కావాలి.
- అప్లికేషన్, ఫోటో, విద్యార్హతల సర్టిఫికెట్స్ పంపించాల్సిన మెయిల్ ఐడి – sbicriadmn2021@gmail.com
🔥 ఇంటర్వ్యూ తేదీ మరియు ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం :
- 31 జనవరి 2025 ఉదయం 11.00 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయి.
- సుగంధ ద్రవ్యాల బోర్డు, ICRI, ప్రాంతీయ స్టేషన్ డోనిగల్, సకలేష్‌పూర్, హసన్, కర్ణాటక-573134 sbicriskp@gmail.com , 08173-295575
🔥 ముఖ్యమైన గమనిక :
- ఈ ఉద్యోగాలను రెండు సంవత్సరాలు కాల్ పరిమితికి భర్తీ చేస్తున్నారు. మొదటి సంవత్సరం ట్రైనింగ్ ఇచ్చి పనితీరు బాగుంటే కొనసాగిస్తారు.
- ఈ రిక్రూట్మెంట్ ప్రత్యేకంగా ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థుల కోసం నిర్వహిస్తున్నారు.
🏹 Download Full Notification- Click here