వైఎస్సార్ ఆరోగ్య శ్రీ లో ఉద్యోగాలు భర్తీ | YSR Aarogya Sri Aarogya Mithra and Team Lead Jobs

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఆంధ్రప్రదేశ్ లో వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. 

ఈ నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వైయస్సార్ ఆరోగ్యశ్రీలో ఆరోగ్య మిత్ర మరియు టీం లీడర్ పోస్టులను భర్తీ చేస్తున్నారు .

ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు , ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్డ్ సర్వీసెస్ నిబంధనల ప్రకారం ఈ ఉద్యోగాల ఎంపిక ఉంటుంది .

ఈ నోటిఫికేషన్ ద్వారా వైయస్సార్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ లో ఉన్న పోస్టులు భర్తీ చేస్తున్నారు. 

అర్హులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడం ద్వారా ఎంపిక కావచ్చు.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు జనవరి 6వ తేదీ లోపు అప్లై చేయాలి.

ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేయాలి.

నోటిఫికేషన్ కి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు క్రింద ఇవ్వబడినవి.

✅ పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో అత్యుత్తమ ఫ్యాకల్టీ తో చెప్పించిన గ్రామ సచివాలయం , పోలీసు ఉద్యోగాలు , గ్రూప్-2 మరియు నర్సింగ్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ కోసం మన యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి . కేవలము 499/- రూపాయలకే ఆన్లైన్ కోచింగ్ ( 6 నెలల వ్యాలిడిటీ ) 

✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి..

🔥 నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : వైయస్సార్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, ప్రకాశం జిల్లా

🔥 ఇవి ఎలాంటి ఉద్యోగాలు ( పర్మినెంట్ / కాంట్రాక్ట్ / ఔట్సౌర్సింగ్ ) :  ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 పోస్ట్లు:  టీం లీడర్ మరియు ఆరోగ్య మిత్ర

🔥 అర్హతలు : 

ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు : 

  1. B.Sc (నర్సింగ్)/M.Sc (నర్సింగ్)/B.ఫార్మసీ/ఫార్మసీ-D/B.Sc (మెడికల్ ల్యాబ్-టెక్నాలజీతో మంచి విద్యా రికార్డు)

b ) నైపుణ్యాలు

i. అద్భుతమైన సమాచార నైపుణ్యాలు

ii. తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడం రాయడం మాట్లాడడం వచ్చుండాలి.

iii. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి ఎమ్మెస్ ఆఫీస్ నందు మంచి నైపుణ్యం ఉండాలి.

iv. వైద్య స్థితి / శస్త్ర చికిత్స ప్రత్యేకతలు మరియు

ఆసుపత్రి పరిపాలన కు సంబంధించిన ప్రాథమిక అవగాహన ఉండాలి. 

టీం లీడర్ ఉద్యోగాలకు : 

  1. అర్హతలు:  B.Sc (నర్సింగ్)/M.Sc

(నర్సింగ్)/B.ఫార్మసీ/ఫార్మసీ-D/B.Sc (మెడికల్

ల్యాబ్-టెక్నాలజీతో మంచి విద్యా రికార్డు)

  1.  అనుభవం:  ఆసుపత్రిలో సేవలు యందు కనిష్టంగా 2 సంవత్సరాల పూర్తి సమయం అనుభవం ఉండాలి.
  1. నైపుణ్యాలు : 

i. అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు మరియు నాయకత్వపు లక్షణాలు.

ii. తెలుగు మరియు ఇంగ్లీష్ చదవడం రాయడం మాట్లాడడం వచ్చుండాలి.

iii. సంక్లిష్టమైన పరిస్థితులను నిర్వహించగలగాలి.

iv. కంప్యూటరైజ్డ్ డేటా సేకరణ, నిర్వహణ, రిపోర్టింగ్ మరియు విశ్లేషణ వ్యవస్థ పట్ల అవగాహన కలిగి ఉండాలి. 

v. వైద్య స్థితి / శస్త్ర చికిత్స ప్రత్యేకతలు మరియు

ఆసుపత్రి పరిపాలన కు సంబంధించిన ప్రాథమిక అవగాహన ఉండాలి. 

(d) అదనపు అర్హతలు – ఏదైనా పీజీ, 

ఆసుపత్రి పరిపాలన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.

🔥 మొత్తం పోస్టులు : 19

ఇందులో ఆరోగ్య మిత్ర ఉద్యోగాలు 17 ఉన్నాయి. టీం లీడర్ ఉద్యోగాలు 2 ఉన్నాయి. 

ఈ పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం లేదా తగ్గే అవకాశం ఉంటుందని నోటిఫికేషన్ లో స్పష్టం చేయడం జరిగింది.

🔥 జీతము : 

ఆరోగ్య మిత్ర ఉద్యోగాలకు 15,000/- , టీం లీడర్ ఉద్యోగాలకు 18,500 జీతం ఉంటుంది.

🔥 కనీస వయసు : 18 సంవత్సరాలు

🔥 గరిష్ట వయస్సు : 42 సంవత్సరాలు

వయస్సు సడలింపు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనలు ప్రకారం వయో సడలింపు ఉంటుంది . 

అనగా ఎస్సీ , ఎస్టీ , బీసీ , EWS అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు , మరియు వికలాంగ అభ్యర్థులకు పది సంవత్సరాల వయో సడలింపు కలదు . 

ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు మూడు సంవత్సరాల వరకు వయసు సడలింపు ఉంటుంది .

🔥 అప్లికేషన్ ప్రారంభ తేదీ : 27-12-2023

🔥 అప్లికేషన్ చివరి తేదీ : 06-01-2024

🔥 ఎంపిక విధానం ఎలా ఉంటుంది : అకాడమిక్ మార్కులు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

🔥 ఫీజు : ఓసి , EWS మరియు BC అభ్యర్థులు 500/- ఫీజు చెల్లించాలి.

SC/ ST, దివ్యాంగులైన అభ్యర్థులకు అభ్యర్థులకు ఫీజు – 300/-

🔥 అప్లికేషన్ విధానం : 

O/o జిల్లా కో ఆర్డినేటర్, Dr.YSR AHCT, ప్రకాశం భవన్ ఎదురుగా, పాత RIMS

ప్రాంగణం, ఒంగోలు, ప్రకాశం జిల్లా

🔥 ఎలా అప్లై చెయాలి : క్రింద మీకోసం అధికారిక నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి లింక్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి పూర్తి నోటిఫికేషన్ చూసి అర్హత ఆసక్తి ఉంటే త్వరగా అప్లై చేసుకోండి.. 

 

గమనిక : నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా పూర్తి నోటిఫికేషన్ చదివి తర్వాత అప్లై చేయండి . మరి కొన్ని నోటిఫికేషన్స్ సమచారం కోసం ” INB jobs info ” యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . మా Telegram Group లో జాయిన్ అవ్వండి .

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!