ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మేలు చేసేందుకు మరొక మంచి కార్యక్రమాన్ని ప్రారంభించబోతోంది.
రాష్ట్రంలో గల ప్రతి కుటుంబానికి ఆరోగ్య భీమా (హెల్త్ ఇన్సూరెన్స్) వర్తించే విధంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆరోగ్యశ్రీ సేవలను భీమా విధానాల్లో అమలు చేయబోతున్నారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి 25 లక్షల రూపాయల చికిత్సను అర్హులైన వారికి మాత్రమే ఉచితంగా అందజేయడం జరుగుతుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఈ ఆర్టికల్ చివరి వరకు చదవగలరు.
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్, టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
📌 Join Our What’s App Channel
📌 Join Our Telegram Channel
🔥 రాష్ట్రం లో పౌరులందరికీ ఆరోగ్య భీమా (AP Government Health Insurance Scheme) :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు అమలులో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో గల ప్రతి కుటుంబానికి అనగా బిపిఎల్ (BPL) మరియు ఏపీఎల్ (APL) కుటుంబాలకు కూడా వర్తించే విధంగా ఆరోగ్యం బీమా పథకాన్ని ప్రారంభించబోతున్నారు.
- ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆరోగ్యశ్రీ సేవలను భీమా విధానంలో అమలు చేసేది గాను కార్యాచరణ ప్రారంభిస్తున్నారు.
- భీమా విధానం అమలుపై ఆరోగ్య శాఖ రూపొందించిన డ్రాఫ్ట్ ను ఆర్థిక శాఖ పరిశీలిస్తుంది.
- ఈ ఆరోగ్య బీమా అమలు చేయడం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారితో పాటుగా దారిద్య్ర రేఖకు ఎగువ ఉన్నవారు కూడా లబ్ధి చేకూరే విధంగా మార్గదర్శకాలు జారీ చేయనున్నారు.
- రాష్ట్రంలో ప్రస్తుతం 1.43 కోట్ల కుటుంబాలు బిలో పావర్టీ లైన్ (BPL) క్రింద ఉండగా, 20 లక్షల వరకు కుటుంబాలు అబౌవ్ పావర్టీ లైన్ (APL) కి ఉన్నాయి.
- రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకు కూడా ఎటువంటి షరతులు లేని ఆరోగ్య బీమా వర్తింప చేయనున్నారు.
- ప్రతి కుటుంబానికి రెండు లక్షల 50 వేల రూపాయలవైద్య సేవలు సదుపాయాలు ఈ ఆరోగ్య భీమా ద్వారా ఉచితంగా అందజేస్తారు.
- 2,50,000/- కు పైగా వైద్య సేవలు కొరకు , 25 లక్షల రూపాయల లోపు వైద్య సేవల ఖర్చును ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా హైబ్రిడ్ విధానంలో భరించే విధంగా ముసాయిదాను తయారు చేశారు.
🔥ఆరోగ్య భీమా కొరకు రెండు జోన్లు గా ఆంధ్రప్రదేశ్:
- రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాలను రెండు జోన్లుగా విభజించనున్నారు.
- రెండు జోన్లుగా విభజించి, టెండర్లు పిలవడం ద్వారా బీమా కంపెనీలను ఎంపిక చేయడం జరుగుతుంది.
🔥 నేషనల్ హెల్త్ అథారిటీ అప్లికేషన్ సహాయంతో :
- ఈ ఆరోగ్య బీమా కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వ నేషనల్ హెల్త్ అథారిటీ యాప్ ను ఎన్టీఆర్ సేవా ట్రస్ట్ సంస్థ ఉపయోగించునుంది.
- ఎవరైనా ఒక రోగి ఆసుపత్రిలో చేరినప్పటి నుండి డిస్చార్జ్ తీసుకునేంతవరకు అలానే రోగ నిర్ధారణ కొరకు నిర్వహించే పరీక్షలు యొక్క రిపోర్ట్లు, హాస్పిటల్ నుండి క్లెయిమ్స్ చేసేటప్పుడు అవసరముగు అంశాలు మరియు అవకతవకలను గుర్తించేందుకుగాను టెక్నాలజీని వాడనున్నారు.
🏹 ఇలాంటి పథకాల సమాచారం మీ మొబైల్ కు రావాలి అంటే మా what’s app ఛానల్ లో జాయిన్ అవ్వండి – Click here