భారత ప్రభుత్వ అండర్ టేకింగ్ సంస్థ మరియు నవరత్న హోదా పొందిన కంపెనీ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టీలైజర్స్ లిమిటెడ్ (RCF Ltd) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
ఈ రిక్రూట్మెంట్ ద్వారా ఆపరేటర్ ట్రైనీ (కెమికల్) , బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ – 3 , జూనియర్ ఫైర్ మాన్ గ్రేడ్ – 2, నర్సు గ్రేడ్ – 2 , టెక్నికల్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్) , టెక్నీషియన్ (ఎలక్ట్రికల్) ట్రైనీ, టెక్నీషియన్ (మెకానికల్) ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ స్పెషల్ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 74 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు విధానం , ఎంపిక విధానం వంటి అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
🏹 కేంద్ర ప్రభుత్వ సంస్థలో కాంట్రాక్టు ఉద్యోగాలు – Click here
✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి.
🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :
రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టీలైజర్స్ లిమిటెడ్ (RCF Ltd) సంస్థ నుండి ఈ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
🔥 మొత్తం ఉద్యోగాలు :
74 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
🔥 భర్తీ చేయబోయే ఉద్యోగాలు :
ఆపరేటర్ ట్రైనీ (కెమికల్) – 54
బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 – 03
జూనియర్ ఫైర్ మాన్ గ్రేడ్ 2 – 02
నర్సు గ్రేడ్ 2 – 01
టెక్నికల్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్) – 04
టెక్నీషియన్ ( ఎలక్ట్రికల్) ట్రైనీ – 02
టెక్నీషియన్ (మెకానికల్) ట్రైనీ – 08
🔥 విద్యార్హత :
ఆపరేటర్ ట్రైనీ (కెమికల్) :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి బి. ఎస్సీ ( కెమిస్ట్రీ) ఉత్తీర్ణత మరియు డిగ్రీ చదువుతున్న సమయంలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ నుండి అటెండెంట్ ఆపరేటర్ పూర్తి చేసి వుండాలి. లేదా కెమికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి 1 సంవత్సరం అప్రెంటిస్ ట్రైనింగ్ ఉత్తీర్ణత సాధించాలి.
చివరి రెండు సెమిస్టర్ల ఓబీసీ అభ్యర్థులు కనీసం 55 శాతం మార్కులు , ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు పొంది వుండాలి.
బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3:
పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి, బాయిలర్ అటెండెంట్ సర్టిఫికెట్ కలిగి వుండాలి / బాయిలర్ అటెండెంట్ గా NCVT సర్టిఫికెట్ కలిగి వుండాలి.
2 సంవత్సరాలు బాయిలర్ అటెండెంట్ / బాయిలర్ ఆపరేటర్ గా పని చేసిన అనుభవం కలిగి వుండాలి.
జూనియర్ ఫైర్ మాన్ గ్రేడ్ 2:
పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి , 6 నెలల ఫైర్ మెన్ సర్టిఫికెట్ కోర్సు చేసి వుండాలి.
ఇండస్ట్రియల్ ఫైర్ ఫైటింగ్ లో 1 సంవత్సరం అనుభవం కలిగి వుండాలి.
నర్సు గ్రేడ్ 2:
HSC/ ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత సాధించి , 3 సంవత్సరాల జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ఉత్తీర్ణత సాధించాలి. లేదా బి.ఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాధించాలి.
సంబంధిత విభాగంలో 2 సంవత్సరాల అనుభవం కలిగి వుండాలి.
టెక్నీషియన్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంటేషన్):
ఇన్స్ట్రుమెంటేషన్ విభాగంలో డిప్లొమా లేదా బి.ఎస్సీ ఫిజిక్స్ ఉత్తీర్ణత సాధించాలి.
సంబంధిత విభాగంలో 1 సంవత్సరం ట్రైనింగ్ ఉత్తీర్ణత సాధించాలి.
టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రికల్):
ఎలక్ట్రికల్ లేదా సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసి వుండాలి.
టెక్నీషియన్ ట్రైనీ (మెకానికల్):
మెకానికల్ లేదా సంబంధిత విభాగంలో 3 సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
సంబంధిత విభాగంలో ఒక సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసి వుండాలి.
🏹 AP లో జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల – Click here
🔥 గరిష్ఠ వయస్సు :
ఆపరేటర్ ట్రైనీ (కెమికల్) ఉద్యోగానికి ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారు 35 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులు 33 సంవత్సరాలు గరిష్ఠ వయసు కలిగి వుండాలి.
బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ – 3 ఉద్యోగానికి 35 సంవత్సరాల లోపు వయసు గల ఎస్టీ అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు .
జూనియర్ ఫైర్ మెన్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి 34 సంవత్సరాల లోపు గల ఎస్టీ అభ్యర్ధులు అర్హులు.
నర్సింగ్ గ్రేడ్ – 2 ఉద్యోగాలకు 36 సంవత్సరాల లోపు వయస్సు గల ఎస్సీ అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
టెక్నికల్ ట్రైనీ (ఎలక్ట్రికల్), టెక్నికల్ ట్రైనీ (ఇన్స్ట్రుమెంట్స్) ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు గల ఎస్సీ ఎస్టీ అభ్యర్ధులు అర్హులు.
టెక్నికల్ ట్రైనీ (మెకానికల్) ఉద్యోగాలకు 35 సంవత్సరాల లోపు ఎస్సీ ఎస్టీ అభ్యర్ధులు, 33 సంవత్సరాల లోపు వయస్సు గల ఓబీసీ అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔥 జీతం :
టెక్నికల్ ట్రైనీ , నర్సింగ్ ఉద్యోగాలకు ఎంపిక కాబడిన వారికి 22,000/- నుండి 60,000/- రూపాయల జీతం లభిస్తుంది.
బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్ 3 గా ఎంపిక అయిన వారికి 20,000/- నుండి 55,000/- రూపాయల జీతం లభిస్తుంది.
జూనియర్ ఫైర్ మెన్ గా ఎంపిక అయిన వారికి 18,000/- నుండి 42,000/- రూపాయల జీతం లభిస్తుంది.
🔥 దరఖాస్తు విధానం :
అభ్యర్థులు ఆన్లైన్ విధానం ద్వారా అధికారిక వెబ్సైట్ దరఖాస్తు చేసుకోవాలి.
🔥 దరఖాస్తు ఫీజు:
ఎస్సీ , ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మాన్, మహిళా అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లిచవలసిన అవసరం లేదు.
ఓబీసీ నాన్ క్రీమిలేయర్ అభ్యర్థులు 700/- రూపాయల దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
🔥 ఎంపిక విధానం :
ఆన్లైన్ టెస్ట్ , స్కిల్ టెస్ట్ , మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
🔥 ముఖ్యమైన తేదిలు :
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేది: 21/03/2025
ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 05/04/2025.
👉 Click here for official website