ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా గల తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు అమలు చేసేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు సిద్ధం అయ్యాయి. అలానే ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా గతంలో ఉన్న పెన్షన్ మొత్తాన్ని పెంచుతూ ఇప్పటికే అమలు చేస్తూ ఉన్నారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతిస్తూ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగాని పథకాలను కూడా అమలు చేసేందుకు గాను ముగ్గు చూపుతుంది. ఇందులో భాగంగా కాపు మహిళలకు గృహిణి పథకం ద్వారా లబ్ధి చేకూర్చేందుకుగాను యోచిస్తున్నట్లు తెలుస్తుంది.
గృహిణి పథకం అమలు విషయమై సమాచారాన్ని క్లుప్తంగా ఈ ఆర్టికల్ లో మీకు తెలియజేయబోతున్నాం.
🔥 గృహిణి పథకం ఎవరి కొరకు ? :
- రాష్ట్రంలో ఉన్న మహిళలకు లబ్ధి చేకూరే విధంగా వివిధ కార్పొరేషన్ల ద్వారా వివిధ పథకాల అమలవుతూ ఉండగా, ఇందులో భాగంగా కాపు మహిళలకు లబ్ధి చేకూరే విధంగా గృహిణి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది.
- కాపు మహిళలకు ఆర్థిక చేయోతనిచ్చేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గృహిణి అనే పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు తెలియజేశారు.
✅ ఏపీలో జూన్ 1 నుండి రేషన్ షాపు టైమింగ్స్ ఇవే – Click here
🔥 ఏ విధంగా లబ్ది చేకూరుతోంది :
- ఈ పథకానికి అర్హత కలిగిన కాపు మహిళలకు పదిహేను వేల రూపాయలు చొప్పున లబ్ధి చేకూర్చేందుకుగాను కాపు కార్పొరేషన్ ప్రతిపాదించింది.
- అతి త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేసేందుకు గాను మార్గదర్శకాలు, విధివిధానాలు రూపొందించనున్నారు.
- ఈ పథకం ద్వారా అర్హత పొందే మహిళలకు 15 వేల రూపాయలు చొప్పున అందించడం వలన ప్రభుత్వానికి 400 కోట్లు అవసరం అవుతాయని చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు వివరించారు.
- ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్నందున ముందుగా బడ్జెట్ అంచనాలు, ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేయాలి, లబ్ధిదారులను ఏ విధంగా గుర్తించాలి, వంటి అన్ని అంశాలను కూలంకుశంగా అంచనా వేశాక అమలు కొరకు అధికారులకు సూచనలు జారీ చేస్తారు.